Home / ANDHRAPRADESH / రమణా.. జగన్ గేట్లు తెరిచాడు.. టీడీపీ దుకాణం ఎత్తేయాలా..!

రమణా.. జగన్ గేట్లు తెరిచాడు.. టీడీపీ దుకాణం ఎత్తేయాలా..!

ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. గత 9 నెలలుగా టీడీపీ రాజకీయంగా ఎన్ని కుట్రలు చేసినా…తట్టుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. లోటు బడ్జె‌ట్‌ ఉన్నా జాగ్రత్తగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే నీచ రాజకీయానికి తెర లేపాడు. గత 9 నెలలుగా రోజుకో అంశంతో ఎల్లోమీడియాతో కలిసి ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నాడు. తొలుత అమరావతి రాజధానిలో పనులు ఆగిపోయాయని, ఆ తర్వాత పోలవరం, రీటెండరింగ్ కాదు రివర్స్ టెండరింగ్ అని దుష్ప్రచారం.. పల్నాడులో పునరావాస శిబిరాల డ్రామా, కోడెల ఆత్మహత్య డ్రామా, ఇసుక కొరత డ్రామా, ఇంగ్లీష్ మీడియంపై డ్రామా, గత మూడు నెలలుగా అమరావతి రాజధాని డ్రామా..ఇలా 9 నెలలుగా నెలకో రచ్చ చేయిస్తూ.. ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు.

 

అయితే చంద్రబాబు తీరుపై విసిగిపోయిన టీడీపీ సీనియర్ నేతలంతా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కాని వందల కోట్ల రూపాయలు, కాంట్రాక్టులు, మంత్రి పదవులు ఇస్తానని మభ్యపెట్టి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబులా జగన్ చేయలేదు. తన పార్టీలో ఎవరైనా చేరాలంటే ముందుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని షరతు పెట్టాడు. అందుకే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిలు టీడీపీకి రాజీనామా చేసినా జగన్ కోరిక మేరకు వైసీపీలో చేరలేదు. కాని అసెంబ్లీలో స్వతంత్ర్యంగా ఉంటూ…వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ఒక వేళ జగన్ కనుక చంద్రబాబులా వ్యవహరించి గేట్లు తీస్తే..టీడీపీలో బాబు లోకేష్‌తో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్పా..ఎవరూ మిగలరన్నది ఒప్పుకోవాల్సిన కఠోర వాస్తవం.

 

అయితే సహనానికి ఓ హద్దు అంటూ ఉంటుంది. జగన్ మంచితనాన్ని చంద్రబాబు చేతకానితనంగా భావిస్తున్నాడు. అందుకే ఇష్టం వచ్చినట్లు ఎల్లోమీడియాతో బద్నాం చేయిస్తూ.. ప్రభుత్వాన్ని త్వరగా దించేయాలని కుట్రలు చేస్తున్నాడు. చంద్రబాబు జిత్తులమారి తెలివితేటలు గ్రహించిన సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇంత కాలం వేరే పార్టీ నుంచి ఎవరూ రాకుండా క్లోజ్ చేసిన తన పార్టీ గేట్లను ఓపెన్ చేశాడు. దీంతో దశాబ్దాలుగా టీడీపీలో పని చేస్తున్న సీనియర్ నేతలంతా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. సీనియర్ నేతలు డొక్కా, రెహమాన్, రామసుబ్బారెడ్డి కుటుంబం, కదిరిబాబురావు ఇప్పటికే వైసీపీలో చేరగా, కాంగ్రెస్ మాజీ మంత్రి బాలరాజుతో పాటు జనసేన అగ్ర నేతలు వైసీపీలో చేరారు.

 

ఇక పులివెందుల టీడీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కరణం బలరామ్ కూడా వైసీపీలో చేరుతున్నారు. అలాగే అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కూడా వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక విశాఖలో ముగ్గురు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబులా జగన్ చేయడం లేదు. అసలు టీడీపీ ఎమ్మెల్యేలను డైరెక్ట్‌గా తన పార్టీలోకి చేర్చుకోవడం లేదు.. మంత్రి పదవులు ఇవ్వడం లేదు.. వారిని రాజీనామా చేసి రమ్మంటున్నాడు…లేదా స్వతంత్రంగా ఉండమంటున్నాడు. మొత్తంగా గత 9 నెలలుగా తన ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న కుట్రలకు సీఎం జగన్ చెక్ పెడుతున్నాడు. తన పార్టీలోకి గేట్లు ఎత్తేశాడు..ఇంకేముంది రోజుకో టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి చేరిపోతున్నారు. దీంతో రమణా..జగన్ గేట్లు తెరిచాడు టీడీపీ దుకాణం ఎత్తేయాలా అంటూ నెట్‌జన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat