Home / ANDHRAPRADESH / బోండా ఉమ సవాల్‌కు పిన్నెల్లి ప్రతిసవాల్..కాక రేపుతున్న ఏపీ రాజకీయం..!

బోండా ఉమ సవాల్‌కు పిన్నెల్లి ప్రతిసవాల్..కాక రేపుతున్న ఏపీ రాజకీయం..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జరిగిన మాచర్ల ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది. అధికార వైసీపీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మా పార్టీ నేతలను చంపేస్తారా..చంపేస్తే చంపేయండి అంటూ..వరుస ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. ఏకంగా డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి రోడ్డుపై కూర్చుని నానా హంగామా చేశాడు.  ఇక టీడీపీ కార్యాలయంలో బోండా ఉమ ప్రెస్‌మీట్ పెట్టి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సవాలు విసిరాడు. బుద్ధా వెంకన్నతోపాటు తనను హత్య చేయాలని వైసీపీ కుట్ర పన్నిందని బోండా ఉమ ఆరోపించాడు. జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు ఆపడంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు న్యాయవాది సహా మూడు కార్లలో మాచర్ల వెళ్లామని.. వైసీపీ నేతలు కారంపూడి నుంచి తమ వాహనాన్ని అనుసరించారని చెప్పారు. వైసీపీ నేత తురక కిశోర్ సహా 30 మంది కార్యకర్తలు కర్రలు, రాళ్లతో తమ వాహనంపై దాడి చేశారని బోండా తెలిపారు. అయితే తాము ప్రయాణిస్తున్న కారు బాలుడిని ఢీకొట్టిందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ రేపు మాచర్ల వస్తామంటూ పిన్నెల్లికి ఉమ సవాల్ విసిరాడు.

 

కాగా బోండా ఉమా సవాల్‌పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీటుగా స్పందించారు. పల్నాడు ప్రజలు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లు కాదని బోండా ఉమా తెలుసుకోవాలని పిన్నెల్లి కౌంటర్ ఇచ్చారు. విజయవాడ గల్లీలో రౌడీయిజం చేసినట్లు పల్నాడులో చేస్తామంటే కుదరదు. మాచర్ల మళ్లీ వస్తానని సవాల్‌ చేయడం కాదు, దమ్ముంటే రావాలి. లేదా నన్ను విజయవాడ రమ్మన్నా వస్తా. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నేను భయపడలేదు. ఇకనైనా బోండా ఉమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని పిన్నెల్లి హెచ్చరించారు. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తే సహించేది లేదు. ఈ విషయంలో ఎక్కడదాకా వెళ‍్లడానికి అయినా నేను సిద్ధంగా ఉంటా.. ఎవరినీ ఉపేక్షించేది లేదని పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చారు.

 

ఇక మాచర్ల ఘటనలో అసలేం జరిగిందో పిన్నెల్లి మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జరిగిన చిన్న గొడవను పెద్దది చేసి హంగామా సృష్టించేందుకు విజయవాడ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరికొందరిని చంద్రబాబు అక్కడికి పంపించినట్లు తెలిపారు. బోదిలవీడులో రెండు వర్గాల కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండగా, టీడీపీ నేతలు సోమవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేశారని పిన్నెల్లి తెలిపారు. ఆ దాడిపై వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించడంతో నామినేషన్లు వేసే సమయంలో గొడవ జరిగిందని, దాన్ని మరింత పెద్దది చేసే ఉద్ధేశంతో చంద్రబాబు విజయవాడ నుంచి నాయకులు, కార్యకర్తలను బోదిలవీడుకు పంపి ఉద్రిక్తత సృష్టించాలని చూడగా, మార్గమధ్యలో మాచర్ల వద్ద స్థానికంగా జరిగిన ప్రమాదంతో ఘర్షణ జరిగిందని పిన్నెల్లి వివరించారు. మొత్తంగా మాచర్ల ఘటనతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయాలు ఎండలు ముదరకముందే హీటెక్కాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat