Home / ANDHRAPRADESH / స్థానిక సంస్థల నామినేషన్లపై టీడీపీ రాజకీయం.. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమీషన్..!

స్థానిక సంస్థల నామినేషన్లపై టీడీపీ రాజకీయం.. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమీషన్..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ‌్యంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలంటేనే రాజకీయం ఉద్రిక్తంగా ఉంటుంది. ఆవేశకావేశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడక్కడా ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ సారి కూడా అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. దీంతో చంద్రబాబు రెచ్చిపోతున్నాడు. మాచర్ల ఘటన సందర్భంగా .మా పార్టీ నాయకులను చంపేస్తారా…చంపేస్తే చంపేయండి…అంటూ రోడ్డు పై కూడా హైడ్రామా నడిపాడు. స్థానికంగా గొడవలు సద్దుమణిగేలా హుందాగా వ్యవహరించేది పోయి ఇంకా రెచ్చగొడుతున్నాడు. వైసీపీ నేతలను కవ్వించండి..వాళ్లు రెచ్చిపోయి దాడులు చేస్తే వీడియోలు తీసి పార్టీ కార్యాలయానికి పంపండి అంటూ ఏకంగా వాట్సాప్ నెంబర్ ఒకటి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులకు పంపించాడంటే…చంద్రబాబు కుటిల రాజకీయం ఏంటో అర్థమవుతుంది. దీంతో టీడీపీ నేతలు ముందుగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి..వారిపై దాడులు చేయడం..వారి తిరిగి దాడులు చేస్తే వీడియోలు తీసి పంపండం..ఆ వీడియోలను చంద్రబాబు ఈసీకి పంపి వైసీపీ దాడులంటూ ఫిర్యాదు చేయడం గత రెండు, మూడు రోజులుగా చంద్రబాబుది ఇదే రాజకీయం.. ప్రతిపక్షాల నేతలను భయపెట్టి ఎన్నికలను ఏకపక్షంగా చేసుకుంటారా ? రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, బీహార్ కన్నా అధ్వాన్నంగా మారిపోయిందంటూ చంద్రబాబు రంకెలు వేస్తున్నాడు.

అయితే చంద్రబాబు చెప్పినట్లు నిజంగా రాష్ట్రమంతటా వైసీపీ నేతలు నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇదే విషయాన్ని ఈసీ కూడా ప్రకటించింది. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ముగిసాయి. ఏ ఏ పార్టీ నుంచి ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయో ఈసీ ప్రకటించింది. ఈసీ లెక్కల ప్రకారం..652 జడ్పిటిసి స్ధానాలకు గాను 4778 నామినేషన్లు పడ్డాయి. ఇందులో అధికార వైసిపి తరపున 1866 నామినేషన్లుంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరపున 1413 నామినేషన్లు దాఖలు అయ్యాయి.. ఇక బిజెపి తరపున 473, జనసేన తరపున 270 నామినేషన్లు వేశారు. అంటే వైసిపి, టిడిపిల మధ్య నామినేషన్ల తేడా సుమారు 453 మాత్రమే. చాలా జిల్లాల్లో టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకుని నామినేషన్లు వేశాయి. అంటే టీడీపీ, జనసేన నామినేషన్లు కలిపితే దాదాపుగా 1700 నామినేషన్లు ఉంటాయి. అంటే వైసీపీ, టీడీపీల మధ్య తేడా 200 మాత్రమే..నిజానికి ఇప్పుడు టీడీపీ సీనియర్ నేతలంతా వైసీపీలో చేరిన వేళ..టీడీపీ ఇన్ని నామినేషన్లు వేయడమే గొప్ప..మరి వైసీపీ టీడీపీని నామినేషన్లు వేయకుండా ఎక్కడ అడ్డుకున్నట్లో చంద్రబాబు చెప్పాలి.

ఇక ఎంపీటీసీ నామినేషన్ల విషయానికి వస్తే..9696 ఎంపీటీసీ స్ధానాలకు గాను మొత్తం 50, 064 నామినేషన్లు పడ్డాయి. ఇందులో వైసిపి తరపున 23,121 నామినేషన్లు పడితే తెలుగుదేశంపార్టీ తరపున 18242 నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి తరపున 1816, జనసేన తరపున 2027 మంది నామినేషన్లు వేశారు. నిజానికి టీడీపీ తరపున ఇన్ని వేల నామినేషన్లు వేశారంటేనే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని అర్థమవుతుంది. నామినేషన్ల సందర్భంగా ఒకటి రెండు చోట్ల ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరగడం సర్వసాధారణం. ప్రతి ఎన్నికల వేళ ఇరు పార్టీలు కొట్టుకోవడం జరుగుతూనే ఉంది. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దౌర్జన్యంగా వేయించిన సంగతిని చంద్రబాబు మరిచిపోయాడు..ఇప్పుడు మాత్రం అక్కడక్కడా జరిగిన చిన్నచిన్న ఘటనలను బూతద్దంలో చూపిస్తూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. అయితే చంద్రబాబు కుటిల రాజకీయానికి ఈసీ చెక్ పెట్టింది. వైసీపీతో పోటాపోటీగా టీడీపీ నామినేషన్లు వేసినా చంద్రబాబు మాత్రం తమ వాళ్లను నామినేషన్ల వేయకుండా వైసీపీ అరాచకం చేస్తుందంటూ ఆరోపించడం నిజంగా సిగ్గుచేటు..చంద్రబాబు మార్కు బురద రాజకీయానికి ఇదే పరాకాష్ట. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లపై చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయానికి ఈసీ చెక్ పెట్టింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat