తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో… వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ స్టార్ హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం తారక్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.
ఈ చిత్రంలో మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కల్సి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో ఒకటి చక్కెర్లు కొడుతుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు పాత్రల్లో నటించనున్నాడు అని.
అయితే దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు. గతంలో జైలవకుశ చిత్రంలో త్రిపాత్రాభినయంతో ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులను అటు ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఆరఆర్ఆర్ మూవీలో త్రీ రోల్స్ లో నటించనున్నాడనే వార్త నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు పండుగే కదా…