Home / SLIDER / మార్చి 31 వరకు అన్ని మూసివేయాలి

మార్చి 31 వరకు అన్ని మూసివేయాలి

తెలంగాణ రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మార్చి 31 వరకు మూసివేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు.నిన్న శనివారం సాయంత్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ఈ నిర్ణయం శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని ఎవరు అధిగమించినా కఠినంగా వ్యవహరిస్తామని, ఆ విద్యాసంస్థ గుర్తింపు కూడా రద్దుచేస్తామని హెచ్చరించారు. వీటితోపాటు కోచింగ్‌సెంటర్లు, సమ్మర్‌క్యాంపులు మూసివేయాలని చెప్పారు. విద్యాసంస్థలను మూసివేసినప్పటికీ, ఇంటర్‌, పది తదితర బోర్డు పరీక్షలు, సెట్స్‌ పరీక్షలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని, వీటికోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటారని తెలిపారు.

సాంఘిక సంక్షేమ, మైనార్టీ గురుకులాల్లో పరీక్షలు రాసేవారు హాస్టళ్లలో ఉండవచ్చని.. పరీక్షలు పూర్తయ్యేవరకు వారికి వసతి ఉంటుందన్నారు. మిగిలినవాళ్లను ఇండ్లకు పంపిస్తారని చెప్పారు. హాస్టళ్లలో ఉండేవారికి ప్రత్యేక శానిటరీ ఏర్పాట్లుచేయాలన్నారు. ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ”కరోనా వైరస్ గురించి ఎవరూ భయపడవద్దు..కరోనా మన దేశంలో పుట్టింది కాదు…చైనా దేశంలో పుట్టి ప్రపంచమంతా వ్యాపిస్తుంది..వేరే దేశం నుండి ఇక్కడకొచ్చిన వ్యక్తికే చికిత్స అందించాం..కరోనా వైరస్ సోకిన వ్యక్తికి పూర్తిగా నయమైంది..

కరోనా వైరస్ సోకి చనిపోయింది ఇద్దరుమాత్రమే..దీనికి ఎవరూ భయపడాల్సినవసరం లేదు..కరోనా వైరస్ నివారణకు ఇప్పుడు రూ.500కోట్లు కేటాయిస్తున్నాము..ఫంక్షన్ వేడుకలు,ర్యాలీలు,పబ్లిక్ సమావేశాలకు ఎలాంటి అనుమతుల్లేవు..ఔట్ డోర్,ఇండోర్ మైదానాలన్నీ మూసివేయాలి..బార్లు,క్లబ్ లు అన్ని రకాల జనసముహాలుండేవి మూసివేయాలి..అన్ని రకాల ఆటలు,ఉత్సవాలు,భారీ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతుల్లేవు..ఈ నెల31వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి.ఎవరు వీటిని ఉల్లంఘించిన చర్యలు తీసుకుంటాంజన సముహాం ఉన్నచోటకు వెళ్లకపోవడం మంచిది.ఆర్టీసీ,మెట్రో రైలు యధాతథంగా నడుస్తాయి..వాటికి మినహాయింపు ఉంటుంది అని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat