Home / CRIME / ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వచ్చి కాలేజ్ అమ్మాయిలు…హైటెక్‌ వ్యభిచారం

ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వచ్చి కాలేజ్ అమ్మాయిలు…హైటెక్‌ వ్యభిచారం

చిత్తూరు పలమనేరు నియోజకవర్గంలో హైటెక్‌ వ్యభిచారం జోరందుకుంది. స్మార్ట్‌ ఫోన్ల ద్వారానే మొత్తం వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచివారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్‌ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు భోగట్టా. తొలుత సోషల్‌ మీడియా ద్వారా అమ్మాయిలతో సంబంధాలను ఏర్పరుచుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి వారిని దించుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూస్తే తప్ప అసలు విషయం ఎవరికీ తెలియకుండా సాగుతోంది. తాజాగా నియోజకవర్గంలోని వీకోట పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యభిచార ముఠా గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడి ఓ టీడీపీ నాయకుని బంధువు ఉన్నట్టు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో మూలాలు పలమనేరు, కేజీఎఫ్, బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది.

వ్యభిచార ఊబిలో పడిన వారిలో కళాశాల విద్యార్థినులు, బాలికలు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఆర్థిక అవసరాలు, విలాసాల కోసం జీవితాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో నిర్వాహకులు పెరుగుతూనే ఉన్నారు. పలమనేరులోని గంటావూరు, వీకోట, కర్ణాటకలోని కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన పలువురు వ్యభిచార నిర్వాహకులు రింగుగా ఏర్పడి విటులను స్మార్ట్‌ ఫోన్ల ద్వారా బుక్‌ చేస్తున్నట్టు సమాచారం. విటులు సైతం నిర్వాహకుల ఖాతాలకు గూగూల్‌ పే, ఫోన్‌ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే చాలు అన్నీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు నియోజకవర్గంలోని కొన్ని లాడ్జిలు, పట్టణాల్లోని అవాసప్రాంతాల్లోని ఖరీదైన ఇళ్లు హైటెక్‌ వ్యభిచారానికి అడ్డాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వస్తుంటారని, ఇక లాడ్జిల్లో ప్రత్యేక గదులే ఉన్నాయని సమాచారం. విటుల వద్దకు అమ్మాయిలను చేర్చేందుకు పట్టణంలోని కొందరు అద్దెకు కార్లను సైతం సిద్ధం చేస్తుంటారట. ఈ వ్యవహారంలో సూత్రధారులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా వ్యభిచార నిర్వాహకుల ధనాశకు ఎందరో మహిళలు, యువతులు, విద్యార్థినుల జీవితాలు నాశనమవుతున్నా యి. ఇప్పటికైనా సంబంధిత ప్రాంతాల్లోని పోలీసులు దీనిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat