తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు వర్కింగ్ హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ హాస్టళ్లే మూసివేయాలి తప్పా వర్కింగ్ హాస్టళ్లను కాదు అని కోఆర్డినేషన్ కమిటీ ఆన్ కొవిడ్ -19 స్పష్టం చేసింది.
రాత్రికి రాత్రే హాస్టళ్లను ఖాళీ చేయమంటే వేలాది మంది ఉద్యోగులు ఎక్కడికెళ్తారని హాస్టల్ ఓనర్లను ప్రశ్నించింది. ఎవరైన బలవంతంగా ఖాళీ చేయమంటే డయల్ 100కు సమాచారమివ్వాలని కమిటీ సూచించింది.