Home / ANDHRAPRADESH / టీడీపీ పన్నిన ఉచ్చులో నిమ్మగడ్డ.. అలా జగన్‌ను ఇరికించడానికి కుట్ర జరుగుతుందా..!

టీడీపీ పన్నిన ఉచ్చులో నిమ్మగడ్డ.. అలా జగన్‌ను ఇరికించడానికి కుట్ర జరుగుతుందా..!

ఏపీ స్థానిక ఎన్నికల వాయిదా వివాదంలో రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతుంది. ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీంకోర్డ్ ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఈసీ తీరును తప్పుపట్టింది. దీంతో ఖంగుతిన్న టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే కొత్త కుట్రలను తెరలేపాడు. నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ ఓ ఫేక్ లేఖ సృష్టించాడు. అయితే ఆ లేఖ ఏకంగా నిమ్మగడ్డ ఈమెయిల్‌ నుంచి బయటకు వచ్చిందని ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. నిమ్మగడ్డకు వైసీపీ నేతలతో ప్రాణభయం ఉందని, వెంటనే రక్షణ కల్పించాల్సిందిగా ఆయన కేంద్ర హోం శాఖ మంత్రిని కోరినట్లుగా ఆ లేఖలో ఉంది. కాగా తాను రాసినట్లు ఓ లేఖ ఎల్లోమీడియాలో ప్రసారం అవుతున్నా నిమ్మగడ్డ తొలుత పట్టించుకోలేదు. అయితే ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా బద్నాం చేస్తున్న ఆ లేఖపై రాజకీయంగా దుమారం చెలరేగడంతో ఎట్టకేలను ఆ లేఖను నేను రాయలేదు అంటూ…నిమ్మగడ్డ ఏఎన్‌ఐకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ లేఖను రాసింది నిమ్మగడ్డే..లేకపోతే ప్రెస్‌మీట్ పెట్టి ఖండించేవాడు కదా అని టీడీపీ నాయకులు, చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తున్న సీపీఐ రామకృష్ణ వంటి నేతలు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.

 

అసలు నిమ్మగడ్డ లెటర్ హెడ్ మీద కేంద్ర హోంశాఖకు రాసినట్లు చెబుతున్న ఆ 5 పేజీల లేఖను ఎవరు రాశారనే దానిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకసారి ఆ లెటర్‌లో వాడిన భాష చూస్తే..ఒక ఓ ఐఏయస్ అధికారి రాసిందిలా లేదు…అచ్చమైన టీడీపీ భాష లాగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యాన్ని, ధనం పంపిణీని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన మంచి చట్టాన్ని క్రూరమైనదని ఒక ఎలక్షన్ కమీషనర్‌ ఎలా నిర్ధారిస్తాడు.ఇక తనపై సీఎం జగన్, వైసీపీ మంత్రులు, నేతల విమర్శల తర్వాత తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వెంటనే రక్షణ కల్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖను నిమ్మగడ్డ కోరినట్లు ఆ లేఖలో ఉంది. అయితే తనకు వచ్చిన బెదిరింపుల వివరాలు మాత్రం ఆ లేఖలో పొందుపర్చలేదు.. పైగా ముఖ్యమంత్రి జగన్ ది ఫ్యాక్షన్ నేపధ్యం అని ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ఉన్న అధికారి ఎలా రాతపూర్వకంగా చెప్పగలడు….కచ్చితంగా ఇది టీడీపీ కార్యాలయంలో రాసిన లేఖ అనే అర్థమవుతుంది. ఇక నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసినట్లు చెబుతున్న లేఖ అత్యంత రహస్యంగా ఉండాలి…నిమ్మగడ్డకు, హోం శాఖ కార్యదర్శికి తప్పా..మూడో కంటికి తెలియకూడదు. మరి ఎల్లోమీడియా ఛానళ్లకు ఎలా వెళ్లింది..పచ్చపత్రికలకు ఎలా దొరికింది. దీన్ని బట్టి చూస్తే నిమ్మగడ్డ అనుమతితోనే చంద్రబాబే లెటర్ రాయించి తమ కుల మీడియాకు ఇచ్చారని క్లియర్‌గా అర్థమవుతోంది.

 

ఇక్కడే ఏదో కుట్ర జరుగుతున్నట్లు సందేహాలు కలుగుతున్నాయి. పథకం ప్రకారం తనకు వైసీపీనేతలతో ప్రాణభయం ఉందని నిమ్మగడ్డతో కేంద్ర హోం శాఖ‌కు లెటర్ రాయించి..దాన్ని ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయాలని చంద్రబాబు పన్నిన వ్యూహం వర్కవుట్ అయింది. ఇప్పుడు నిమ్మగడ్డను అంతం చేసి…ఆ నిందను సీఎం జగన్‌పై వేసి, ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. హత్యా రాజకీయాలకు పేరు పెట్టింది టీడీపీ…అర్థరాత్రి నడిరోడ్డు మీద రంగా లాంటి నేతను హత్య చేయించిన చరిత్ర చంద్రబాబుది. ఈ విషయాన్ని టీడీపీ సీనియర్ నేత హరిరామజోగయ్య స్వయంగా మీడియాకు చెప్పారు కూడా..నిమ్మగడ్డను భౌతికంగా అంతం చేసి…ఆ నేరాన్ని జగన్‌పై వేసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా చంద్రబాబు వెనుకాడడు..ఆయన తక్షణమే..తన పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవడం శ్రేయస్కరం. మొత్తంగా ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కులాభిమానంతో తెలిసో తెలియక చంద్రబాబు పన్నిన ఉచ్చులో పీకలదాకా కూరుకుపోయాడు. ఇప్పుడు నిమ్మగడ్డకు నిజంగా ప్రాణభయం ఉంది..వైసీపీతో కాదు..టీడీపీ నేతలతోనే.. ఆయన వంటిమీద ఈగవాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ సర్కార్‌దే…నిమ్మగడ్డ సారూ…చంద్రబాబుతో జర భద్రం..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat