Home / ANDHRAPRADESH / అపర రాజనాల చంద్రబాబు…వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ హాట్ కామెంట్స్..!

అపర రాజనాల చంద్రబాబు…వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ హాట్ కామెంట్స్..!

సినిమాల్లో నందమూరి వారసులు హీరోలైతే..రాజకీయాల్లో చంద్రబాబు మహానటుడు..ఈ మాట స్వయంగా స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. తన పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, పార్టీని, ఆస్తులను లాక్కోవడం కాదు..ఆ‌ఖరకు తన పిల్లలను కూడా దూరం చేసిన చంద్రబాబు తనను మించిన మహానటుడు అని ఎన్టీఆర్ అప్పట్లో ఎంతో ఆవేదనతో అన్నారు. నిజమే రాజకీయాల్లో చంద్రబాబు నటన చూస్తే నెవ్వర్ బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్…రాజకీయాల్లో బాబులా నటించే నాయకులే లేరని చెప్పాలి. పిల్లనిచ్చిన మామ, స్వర్గీయ ఎన్టీఆర్‌‌‌కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారకుడై, మళ్లీ మహానాడులో ఆయన ఫోటోలకు, విగ్రహాలకు దండలేసి కీర్తించగలిగిన మహానటుడు చంద్రబాబు..ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్‌ మీ అంటూ ఫోన్ కాల్‌తో అడ్డంగా దొరికిపోయి..రాత్రికి రాత్రే విజయవాడ పారిపోయి..తన నేరాన్ని ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్యగా చిత్రీకరించిన చంద్రబాబు నటనా చాతుర్యాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవు. ఇక ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అన్న నోటితోనే హోదా పేరుతో ఢిల్లీ నడివీధుల్లో ధర్మపోరాట దీక్షలు చేసి, మిస్టర్ మోదీ నువ్వు మళ్లీ ప్రధాని ఎలా అవుతావో చూస్తా అంటూ తొడ కొట్టిన మహానటుడు చంద్రబాబు.

ఇక నవ్యాంధ్ర ప్రదేశ్‌లో జగన్ సర్కార్ మూడు రాజధానులు ప్రకటించగానే జై అమరావతి అంటూ జోలెపట్టి అడుక్కుంటూ అమరావతి దీక్షలను రక్తికట్టించిన అద్భుత నటుడు.. చంద్రబాబు. ఒకపక్క స్థానిక సంస్థల ఎన్నికలను తన సామాజికవర్గానికి చెందిన ఈసీ నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని కరోనా పేరుతో వాయిదా వేయించి..మరోపక్క అమరావతి దీక్షలను మాత్రం వందలమందితో మూడు నెలలుగా దిగ్విజయవంతంగా నడిపిస్తున్న నటుడు, దర్శకుడు..చంద్రబాబు..అందుకే వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు చంద్రబాబులో మహానటుడైన పాతకాలం నాటి విలన్ రాజనాల కనిపించాడు.

తాజాగా మీడియాతో మంత్రి అవంతి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అపర చాణ్యుకుడు కాదని…అపర రాజనాల మాదిరిగా కరడు కట్టిన విలన్ అవతారం ఎత్తి ఏపీ సర్వనాశనానికి కంకణం కట్టుకున్నారని మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరోనా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించిన చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో తన సామాజికవర్గంతో మందడంలో శతదినోత్సవ దీక్షలు, ఆందోళనలు ఎలా చేయిస్తున్నారని అవంతి ప్రశ్నిచారు. స్థానిక ఎన్నికలను ఓ వైపు ఆపించి అభివృద్ధికి గండి కొట్టారని, ఇపుడు ఏకంగా ఫేక్ లెటర్లతో బురద జల్లుతూ జగన్ సర్కార్‌ను అస్థిర పరచే చర్యలకు దిగారని మంత్రి ఫైర్ అయ్యారు. మొత్తంగా రాజకీయాల్లో చంద్రబాబును మించిన మహానటుడు ఎవరు ఉండరని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పకనే చెబుతున్నారు..నిజమే కదా రాజకీయాల్లో బాబుగారి నటనా చాతుర్యం ముందు నందమూరి హీరోలు కూడా ఎందుకు పనికి రారని తెలుగు తమ్ముళ్లు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat