Home / CRIME / మావోయిస్టులతో భీకర ఎన్‌కౌంటర్‌లో..17 మంది జవాన్లు మృతి 14 మందికి గాయాలు

మావోయిస్టులతో భీకర ఎన్‌కౌంటర్‌లో..17 మంది జవాన్లు మృతి 14 మందికి గాయాలు

చత్తీస్‌గఢ్‌ బస్తర్‌లోని సుక్మాలో మావోయిస్టులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో అదృశ్యమైన 17 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలను ఆదివారం లభ్యమయ్యాయి. శనివారం మధ్యాహ్నం చింతగుహ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 14 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులైన వారిని శనివారం రాత్రి రారుపూర్‌కు తరలించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర బగేల్‌ ఆదివారం జవాన్లను పరామర్శించారు.
ఎల్మాగుండలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, అదేవిధంగా చత్తీస్‌గఢ్‌-తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు అగ్ర నేతల మధ్య సమావేశాలు జరుగుతున్నాయని నిఘా వర్గాల సమాచారం మేరకు చింతగుహ బర్కాపల్‌, టైమ్‌లీయా నుండి జిల్లా రిజర్వ్‌ గార్డ్‌(డిఆర్‌జి), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్‌టిఎఫ్‌), సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కమాండో బెటాలియన్‌ ఫర్‌ రెషల్యూట్‌ యాక్షన్‌(కోబ్రా)ల 600 మందితో కూడిన బృందం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టిందని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం చింతగుహలోని మిన్నప్ప అడవుల్లోని ప్రవేశించిన అనంతరం మావోయిస్టులకు, భద్రతా దళాలు మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. మావోయిస్టులు వెనక్కు తగ్గారని పేర్కొన్నారు.. తిరిగి భద్రతా దళాల బృందం శనివారం మధ్యాహ్నం తమ క్యాంపుకు వెళుతుండగా డిఆర్‌జి బృందంపై మావోయిస్టులు కాల్పులకు తెగబడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో 17 మంది అదృశ్యమయ్యారు. సుమారు 24 గంటల పాటు శ్రమించి వీరి మృతదేహాలను కనుగొన్నారు.

అదృశ్యమైన 17 మంది జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని బస్తర్‌ రేంజ్‌ అధికారి పి సుందర్‌ రాజ్‌ తెలిపారు. అదేవిధంగా ఎకె -47 రైఫిల్స్‌, ఇన్సాస్‌ రైఫిల్స్‌తో సహా 15 ఆయుధాలను స్వాధీనం చేసకున్నామని తెలిపారు. అండర్‌ బారెల్‌ గ్రెనేడ్‌ (యుబిజిఎల్‌) కనిపించలేదని చెప్పారు. ఈ మృతుల్లో ఎక్కువగా డిఆర్‌జి బృంద సభ్యులు 12 మంది ఉన్నారని, ఎస్‌టిఎఫ్‌కు చెందిన వారు ఐదుగురు ఉన్నారని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat