ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో సామాన్యుల దగ్గర నుండి ప్రముఖుల వరకు..రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వం వరకు అందరూ గజగజవణికిపోతున్నారు..
వైద్యులు అయితే తమ ప్రాణాలకు సైతం తెగించి చికిత్సను అందిస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల అమెరికాకెళ్లి వచ్చిన కరీంనగర్ కు చెందిన దంపతులకు కరోనా వైరస్ లక్షణాలున్నాయని తేలింది.దీంతో వీరిద్దర్ని క్యారంటైన్లో ఉంచారు.
అయితే నిన్న గురువారం ఈ దంపతులు జగిత్యాలలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ విషయం తెల్సుకున్న అధికారులు అక్కడకి చేరుకుని వీర్ని క్వారంటైన్ కు తరలించారు.దీనిపై నెటిజన్లు కాస్త అయిన భయం బాధ్యత ఉండక్కర్లేదా అని దంపతులపై విరుచుకుపడుతున్నారు.