తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.శుక్రవారం ఒక్కరోజే 102కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రోజు 110కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో మొత్తం 411కి చేరుకుంది.
మరోవైపు ఇరవై నాలుగంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 91కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 384కి చేరుకుంది.ఇందులో ఎక్కువ కేసులు అనగా 259మంది ఢిల్లీ మర్కాజ్ కి చెందినవారవడం విశేషం.