అల్లు అర్జున్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయిక. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. మేలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేశారు. కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా పడింది.
బుధవారం అల్లు అర్జున్ జన్మదినోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్.ఇందులో బన్నీ లుక్ చాలా రఫ్ అండ్ మాస్ అప్పీరెన్స్ కలిగివుంది.