Home / SLIDER / మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా

మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా

మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా వైరస్ కనపడని శత్రువుగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఆటువంటి శత్రువు మొదటగా అవహించేది ఆత్మీయులదేనని ఆయన వాపోయారు. అటువంటి మహమ్మారీ పై యుద్ధం చేస్తున్న మనకు ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని ఆయన చెప్పుకొచ్చారు.

కరోనా వైరస్ కట్టడిలో బాగంగా సరిహద్దుల్లో సైనికుల వలె విధులు నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖా సిబ్బంది తో పాటు,పోలీస్,పారిశుద్యం కార్మికులకు ఉచితంగా బత్తాయి పండ్లను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు.
రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉండడం తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధిక దిగుబడి ఉన్న బత్తాయి వాడకం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయన చెప్పారు.

కరోనా వైరస్ మీద మానవ సమాజం చేస్తున్న యుద్దంలో సామాజిక దూరాన్ని ఆయుదంగా మార్చుకుంటే విజయం సొంతం అవుతుందని ఆయన ఉద్బోధించారు. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో ఎన్నో ఆయుధాలను సృష్టించుకున్నామని విధివశాత్తు అవన్నీ మరణహోమానికే ఉపయోగపడ్డాయన్నారు.
అటువంటి వైరస్ ప్రబలంగానే యావత్ ప్రపంచం భారత్ వైపే చూసిందన్నారు.

దేశ సంస్కృతి, దేశప్రజల క్రమశిక్షణలే కట్టడికి దోహద పడ్డాయన్నారు.కరోనా కట్టడిలో ప్రపంచంలో నే భారత్ ముందుంటే అందులో తెలంగాణ రాష్ట్రం మరింత ముందుంది అని ఆయన తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ముందస్తు బందోబస్తు మాత్రామే కారణమని ఆయన కొనియాడారు.

జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,మాజీ యం ఎల్ సి పూల రవిందర్, యస్ పి ఏ వి రంగనాధ్, డి యం హెచ్ ఓ కొండల్ రావు,ప్రభుత్వ ఆసుపత్రిసూపరెండేంట్ నరసింహా, జిల్లా ఉద్యాన వన అధికారిణి సంగీత లక్ష్మీ, ఆర్ డి ఓ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat