ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 16లక్షలకు చేరుకుంది.
నిన్న గురువారం ఒక్కరోజే 82వేలకు పైగా కొత్తగా కరోనా కేసుల సంఖ్య నమోదయింది.మరోవైపు కరోనా మరణాల సంఖ్య కూడా దాదాపు 96వేలకు చేరుకుంది.గురువారం ఒక్కరోజే ఈ వైరస్ భారీన పడి ఏడు వేలమందికి పైగా ప్రాణాలను వదిలారు.
అమెరికా దేశంలో గురువారం అత్యధికంగా 31వేల కొత్త కేసులు నమోదైతే పద్దెనిమిది వందల మంది మృత్యువాత పడ్డారు.ఆ తర్వాత ప్రాన్స్ లో పదమూడు వందల మంది మరణించారు.