ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర భయాందోళనను కల్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు.
ప్రతి జిల్లాలోని కరోనా బాధితులకు చికిత్సను అందించే విధంగా ఆస్పత్రులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్.
మరోవైపు కరోనాను నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.రాష్ట్రంలో రెడ్ జోన్ల,హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.