Home / NATIONAL / జిమ్‌లు , యోగా సెంటర్లకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

జిమ్‌లు , యోగా సెంటర్లకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. అందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి. తాజాగా వీటి నిర్వహణపై అనుసరించాల్సిన విధి విధానాలకు సబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన విధి విధానాలు జిమ్‌లు, యోగా కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో   పేర్కొన్నది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 6 అడుగుల దూరం పాటించాలి. ఫేస్‌ గార్డ్స్‌,మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి.

యోగా, లేదా వ్యాయామం వంటివి చేసేప్పుడు మాత్రం ఫేస్‌ గార్డ్‌ ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వ్యాయామం చేసే సమయంలో ఎన్‌-95 మాస్క్‌లు ధరించకపోవడం మేలని సూచించారు.  యోగా శిక్షణలో పాల్గొనే వారి సంఖ్య ఆధారంగా, శిక్షణ తరగతులు షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ప్రతి శిక్షణ తరగతి మధ్య 15 నుంచి 30 నిమిషాల వ్యవధి ఉండాలి. 65 ఏండ్ల వారు, అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేండ్ల వయస్సు లోపు పిల్లలను జిమ్‌, యోగా కేంద్రాల్లోకి అనుమతించకూడదు. ఈ మేరకు సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
ఎయిర్‌కండిషన్డ్‌ ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంచడంతో పాటు, ప్రవేశ, నిష్ర్కమణలకు రెండు దార్లు ఉపయోగించడం మేలని పేర్కొన్నారు.

ప్రతి రోజు తప్పని సరిగా డిస్‌ఇన్ఫెక్షన్‌ స్ప్రే చేయించాల్సి ఉంటుంది. సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవడం వంటివి తరచుగా చేస్తుండాలి. అలానే దగ్గు, జలుబు వంటి వచ్చినప్పడు టిష్యూ, చేతి రుమాలుతో, మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి, ఉమ్మటం వంటివి చేయకూడదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat