Home / SLIDER / మొక్కలు నాటిన GWMC కమిషనర్

మొక్కలు నాటిన GWMC కమిషనర్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖులలో ఉధృతంగా పచ్చదనం పెంపొందించడానికి ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ ను వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి పమేలా సత్పతి
స్వీకరిస్తూ బుధవారం వరంగల్ వడ్డేపల్లి లోని గ్రీన్ లెగసీ పార్క్ ప్రాంగణంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు.

మొక్కలు నాటిన అనంతరం కమిషనర్ పమేలా సత్పతి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ జన్మంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ ప్రమోద్ కుమార్, నిజామాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్ గితేష్ వి పాటిల్ లను గ్రీన్ చాలెంజ్ స్వీకరించవలసిందిగా కోరారు.

ఈ సందర్బంగా కమిషనర్ పమేలా సత్పతి మాట్లాడుతూ రాష్ట్రం లో పచ్చదనం పెంపొందించాలనే, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి హరిత యజ్ఞం లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖులు, ఉన్నతాధికారులు, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి ఆదర్శంగా నిలవాలని అన్నారు.

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ చాలెంజ్”Grow Green Challenge” ఎంతో మందిని కదిలించిందని, విజయవంతంగా కొనసాగుతోందని, రాష్ట్రంలోని సినీ ప్రముఖులు ఉన్నతాధికారులు ప్రజలు అన్ని వర్గాలకు చెందిన వారు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారని కమిషనర్ సత్పతి అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat