కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. పీపీఈ కిట్లు, మందుల ధరలు ఆసుపత్రిలో డిస్ ప్లే చేయాలంది.
డిశ్చార్జ్ సమయంలో పూర్తి వివరాలతో బిల్లు ఇవ్వాలి నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.