భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192కి చేరింది.
మరోవైపు మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 50 వేలకు చేరువగా మరణాల సంఖ్య చేరుకుంది. ప్రతిరోజు దాదాపు వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి.
తాజాగా 996 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 49,036కి చేరింది.