Home / shyam (page 28)

shyam

స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ రాజకీయం.. వైసీపీ నేత సజ్జల కౌంటర్..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఏ ఎన్నికలు అయినా మద్యం ఏరులై పారుతుంది. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభపెడుతుంటారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, ధన ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తుంటోంది. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు, మద్యాన్ని పంచిన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు.  అంతే కాదు …

Read More »

చంద్రబాబుకు వరుస షాక్‌లు.. మరో టీడీపీ మాజీ మంత్రి రాజీనామా…!

స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా కీలక నేత రామసుబ్బారెడ్డితో పాటు మరో సీనియర్ నేత పాలకొండ్రాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ టీడీపీ గుడ్‌బై చెప్పారు. ఇటీవల శాసన మండలిలో జరిగిన …

Read More »

కడప జిల్లాలో టీడీపీ ఖాళీ.. ఇద్దరు కీలక నేతలు రాజీనామా..!

స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కిందా మీదా పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. కడప జిల్లాలో టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డితో మరో కీలక నేత పాలకొండ్రాయుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2014 ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రామసుబ్బారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఎన్నికలు కాగానే చంద్రబాబు ఆదినారాయణ …

Read More »

టీడీపీ కుట్రలపై మంత్రి కన్నబాబు ఫైర్…!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులతో గత 80 రోజులుగా అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నాడు. అందుకే ఎల్లోమీడియాతో కలిసి విశాఖ, కర్నూలుపై పదేపదే విషం కక్కుతున్నాడు. దీంతో ఆగ్రహించిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రజా చైతన్యయాత్ర పేరుతో విశాఖలో అడుగుపెట్టాలని చూసిన …

Read More »

టీడీపీ డబుల్‌గేమ్‌పై మండిపడిన వైవి సుబ్బారెడ్డి..!

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై టీడీపీ  చేస్తున్న కుటిల రాజకీయంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు విజయఢంకా మోగించడం తధ్యమని   ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 9 నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ …

Read More »

తెలంగాణ వార్షిక బడ్జెట్ – 2020-21… ఆయా రంగాలకు కేటాయింపులు ఇవే..?

రాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బడ్జెట్‌ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. . అన్ని …

Read More »

సీఎం కేసీఆర్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..!

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే…తమ ప్రతిభాపాటవాలతో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతూ..సమాజ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళందరికీ ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించిన సమాజమే అభివృద్ధి చెందుతుంది. మహిళలకు యావత్‌ సమాజం అండగా నిలవాలి అని సీఎం …

Read More »

మారుతీరావు ఆత్మహత్యపై స్పందించిన కూతురు అమృత..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఖైరతాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో తన పరువు పోయిందనే కోపంతో అల్లుడు ప్రణయ్‌ను కిరాయి హంతక ముఠాలతో మారుతీరావు చంపించాడు. ఈ హత్య కేసులో జైలుకు వెళ్లిన మారుతీరావు ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యారు. జైలు నుంచి వచ్చాక ఇంటికి రమ్మని కూతురు అమృతపై మధ్యవర్తులతో ఒత్తిడి చేయించాడు. దీనికి …

Read More »

మచిలీపట్నంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం.. వలంటీర్లపై మూకుమ్మడి దాడి..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారనే నెపంతో గ్రామ, వార్డు వలంటీర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామ వలంటీర్లపై దాడులు చేసిన ఉదంతం మరువకముందే మచిలీపట్నంలో మరొక ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొందరు తొమ్మిదో వార్డు సచివాలయం వద్ద వార్డు వలంటీర్లపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రేషన్ కార్డుల గురించి …

Read More »

ఏబీవీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేంద్రం… వణికిపోతున్న ఎల్లో బ్యాచ్..!

ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏపీ ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ జగన్ సర్కార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏబీవీ అవినీతి వ్యవహారాలు బయటపడడంతో జగన్ సర్కార్ ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ని సస్పెండ్‌ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat