BAKTHI – Dharuvu
Home / BAKTHI

BAKTHI

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ట్రాన్స్‌జెండ‌ర్లు

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను కూడా అనుమతించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న తీర్పు వెలువరించినా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాళ ట్రాన్స్‌జెండ‌ర్లు శ‌బ‌రిమ‌ల అయ్యప్ప స్వామిని ద‌ర్శించుకున్నారు. డిసెంబ‌ర్ 16వ తేదీన దర్శనం కోసం బ‌య‌లుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఆందోళ‌న‌కు దిగారు. ఆల‌య ప్రధాన పూజారితో చర్చల అనంతరం ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అనుమ‌తి ల‌భించింది. …

Read More »

‘వైకుంఠ ఏకాదశి’ సందర్భంగా భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు

తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది . మరో రెండు రోజుల్లో దాదాపు లక్షా 70 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు . 18వ తేదీన ఉదయం 1.30లకు వీఐపీలను, ఉదయం 5 గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు.. ఇక వీఐపీలు స్వయంగా …

Read More »

ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహం ఎక్కడంటే?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మ‌రో కీల‌కనిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం రామమందిర నిర్మాణం చేయాలనే డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ధర్మసభ నిర్వహించగా….మరో వైపు అయోధ్యలో అతి ఎత్తైన రాముడి విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో యోగి బిజీగా ఉన్నారు. “స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్” పేరుతో రాముడి విగ్రహాం నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి శనివారం ఖరారు చేశారు. గుజరాత్ లో …

Read More »

తెలంగాణలో విన్నూత‌ రీతిలో బ‌తుక‌మ్మ‌…

తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. బతుకమ్మను పట్టుకొని పారా మోటారులో ఎక్కి మహిళలు చక్కర్లు కొట్టారు. సికింద్రాబాద్‌లోని బైసన్ పోలోగ్రౌండ్‌లో గురువారం పారా మోటరింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, షీటీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి …

Read More »

విజయదశమి శుభాకాంక్షలు…

విజయదశమినాడు ముఖ్యమైనది శమీపూజ. శమీవృక్షమంటే జమ్మిచెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములనూ, వస్త్రములను ఈ శమీ వృక్షంపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసం పూర్తవగానే ఆ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు.తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్ట ను …

Read More »

విదేశాల్లోనూ వైభవంగా బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ సంబురాలు దేశవిదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తోపాటు జర్మనీ, బ్రిటన్, కువైట్, ఆస్ట్రేలియా, షార్జాల్లో, సింగపూర్‌లో ఆదివారం ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో బెర్లిన్ నగరంలో దాదాపు 200 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. లండన్‌లోని కెంట్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు డార్ట్‌ఫోర్డ్ డిప్యూటీ మేయర్ రోజర్ ఎస్ ఎల్ పెర్‌ఫిట్ హాజరయ్యారు. బెర్లిన్ వేడుకల్లో తెలంగాణ …

Read More »

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు

సిడ్నీ బతుకమ్మ & దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF)మరియు ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయ.సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వయించిన బ‌తుక‌మ్మ ఆటా…పాటతో సిడ్నీ నగరం పుల‌కించింది..!! ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. బ‌తుక‌మ్మ బ‌తుక‌మ్మ ఉయ్యాలో….బంగారు బతుక‌మ్మ ఉయ్యాలో….ఉయ్యాల పాట‌లు పాడారు.. స‌ప్త‌వ‌ర్ణాల శోభిత‌మైన పూల‌దొంత‌ర‌ల బ‌తుక‌మ్మ‌లు చూడ‌ముచ్చ‌టేశాయి. వాటి త‌యారీకి ఉద‌యం నుంచే క‌ష్ట‌ప‌డ్డారు. ఉత్త‌మ బ‌తుక‌మ్మ‌ల‌ను నిర్వాహ‌కులు …

Read More »

న్యూజిలాండ్ లో బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా

ఓ దేశ ప్రధాని మొదటిసారి మన బతుకమ్మ ఆడారు. శుక్రవారం న్యూజిలాండ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నారైలు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా పాల్గొన్నారు. నుదుట బొట్టు పెట్టుకొని, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడపడుచులతో కలిసి ఆడిపాడారు. అంతకుముందు బతుకమ్మకు పూజచేశారు. ప్రపంచంలోనే బతుకమ్మ వేడుకల్లో ఓ దేశ ప్రధాని స్వయంగా పాల్గొనడం ఇదేమొదటిసారి అని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని గౌరవించి …

Read More »

ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం ఇదే తొలిసారి

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఆడపడుచులతో కలిసి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. జెసిండా నుదుటన బొట్టు పెట్టుకొని.. బతుకమ్మ చుట్టూ తిరిగి గౌరమ్మకు పూజ చేశారు. అక్కడి తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. న్యూజిలాండ్ చరిత్రలో ప్రధాన మంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా ఆమె …

Read More »

బతుకమ్మకు పండుగ అంగరంగ వైభవంగా

పూల పండుగ బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందని రాష్ట్ర టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బతుకమ్మ సంబురాలను 50 దేశాల్లో జరుపుకొంటున్నారన్నారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న ఆకాశంలో బతుకమ్మ, నీటిలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బైసన్‌పోల్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్‌ప్లాజా, ఎన్టీఆర్ స్టేడియంలలో 17, 18, 19 తేదీల్లో జరిగే పారా మోటరింగ్ విన్యాసాలు ప్రత్యేక …

Read More »