Home / HYDERBAAD (page 5)

HYDERBAAD

అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మొర్చా అధ్యక్షురాలు ఎం.అరుణ, గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మొర్చా అధ్యక్షురాలు కవిత మిశ్రా, జనరల్ సెక్రెటరీ ఎం.భాగ్యలక్ష్మీ, నాయకురాలు రేఖ, మానసలు బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు శుక్రవారం  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి నివాసం వద్ద బీజేపీ నుండి బీఆర్ఎస్ లో …

Read More »

హైదరాబాద్ లో ఆరేండ్లలో 17 ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులు పూర్తి

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న ఐటీ కారిడార్‌లో శిల్పాలేఔట్‌ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంతోపాటు రోడ్ల కనెక్టివిటీకి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఆరేండ్ల్లలో 17 ప్రాజెక్టులు పూర్తిచేసినట్టు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా …

Read More »

నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే Kp…

 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిధిలోని  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో నివాసముంటున్న అంజమ్మ ఇంటి పైకప్పు నిన్న మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలింది. అదే సమయంలో నిద్రిస్తున్న చిన్నారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు అక్కడికి వెళ్లి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేలు ఆర్థికసాయాన్ని అంజమ్మకు …

Read More »

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ భరోసా…

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తీలో నివాసం ఉంటున్న బద్దిని అనసూయ మంగళవారం తన ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో అనసూయ ఇల్లు 80 శాతం దగ్ధం కావడంతో పాటు 10 ఏళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు వెంటనే అక్కడికి వెళ్లి …

Read More »

ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే Kp సమీక్ష

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్-కొంపల్లి మున్సిపాలిటీలలో సుమారు రూ.205 కోట్లతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ, మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి, ఎస్.ఎన్.డి.పి, అర్బన్ ఫారెస్ట్, టీఎస్పిడిసీఎల్, కన్స్ట్రక్షన్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కు విన్నపం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కౌసల్య కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని, కాలనీ ఎంట్రెన్స్ నుండి మొదలుకొని మియాపూర్ మెయిన్ రోడ్డు వరకు బాక్స్ నాలాను …

Read More »

హైదరాబాద్ లో ఈ రోజు సూర్యగ్రహాణం ఎప్పుడంటే ..?

ఈ ర్ోజు ( నెల 25న )ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మన దేశంలో వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. కాబట్టి అక్టోబర్ 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం …

Read More »

హైదరాబాద్ కు మరో ఘనత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్‌ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పచ్చదనం పెంపుపై వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డుతోపాటు లివింగ్‌ గ్రీన్‌ ఫర్‌ ఎకనమిక్‌ రికవరీ అండ్‌ ఇన్‌ క్లూజివ్‌ గ్రోత్‌ అవార్డునూ దక్కించుకొన్నది. ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌ (ఏఐపీహెచ్‌) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్‌ నగరానికి వరల్డ్‌ సిటీ గ్రీన్‌ అవార్డును ప్రదానం చేశారు. నగరానికి విశ్వఖ్యాతి రావడానికి సీఎం కేసీఆర్‌ …

Read More »

ఘోరం.. ఉప్పల్‌లో తండ్రీకొడుకుల దారుణ హత్య!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 5 గంటల సమయంలో తండ్రీకొడుకులు దారుణహత్యకు గురయ్యారు. ఉప్పల్‌లోని గాంధీబొమ్మ బ్యాక్‌సైడ్ హనుమసాయి కాలనీలో ఈ జంట హత్యలు జరిగాయి. హనుమసాయి కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి నరసింహమూర్తి (78), కొడుకు శ్రీనివాస్ (35)లను దుండగులు గొడ్దలితో అత్యంత పాశవికంగా చంపేశారు. ముందుగా తండ్రి మీద దాడి చేసిన దుండగులు అడ్డు వచ్చిన కొడుకుని …

Read More »

హైదరాబాద్ లో మధ్యాహ్నాం 3గం.ల నుండి ట్రాఫిక్ అంక్షలు

తెలంగాణ సంప్రదాయ ఆచార సంస్కృతిలకు ప్రతిరూపమైన  పూలసంబురం బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీంతో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. బషీర్‌బాగ్‌, పీసీఆర్‌ జంక్షన్‌, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్‌, నాంపల్లి, అబిడ్స్‌, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat