NATIONAL – Page 30 – Dharuvu
Breaking News
Home / NATIONAL (page 30)

NATIONAL

కర్ణాటక ఎలక్షన్స్.. వైఎస్ ఫోటోలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..!!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పసి పిల్లోడి నుండి పండు ముసలోళ్ళ వరకు అందరికీ న్యాయం చేసిన మహానేత.ఇప్పటికీ ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఎందుకంటే అయన ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికి అందాయి.ప్రతి పేదవాడు ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలను గొప్ప వరంగా స్వీకరించారు.అందుకే ఆయనకు రెండోసారి పట్టం కట్టారు.రాజశేఖర్ రెడ్డి మాట ఇస్తే..తప్పుడు అని …

Read More »

టీఆర్ఎస్‌ను కాపీ కొట్టిన బీజేపీ..కేటీఆర్ ట్వీట్ వైర‌ల్‌

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం తీరు అనేక రాష్ర్టాల‌కు స్ఫూర్తిదాకంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆయా రాష్ర్టాల మంత్రుల‌తో పాటుగా కేంద్ర‌మంత్రులు సైతం మ‌న ప‌థ‌కాల‌ను అభినందించాయి. ఇవి ఇత‌ర రాష్ర్టాల‌కు ఆద‌ర్శ‌మ‌ని పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌న మ్యానిఫెస్టోలేనే ఈ ప‌థ‌కాల‌ను దింపేసింది. కర్ణాటక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను …

Read More »

కర్ణాటక ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో ఇదే..

ఈ నెల 12 న జరగనున్న  కర్నాటక శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది . ఈ మేనిఫెస్టో ముఖ్యంగా మహిళల దృష్టిని ఆకర్షించే విధంగా, రైతులకు హామీ కల్పించే విధంగా రూపొందించింది. కర్నాటకలో బీజేపీ అధికారంలోని వస్తే ముఖ్యమంత్రి స్మార్ ఫోన్ యోజన అనే ఒక కొత్త పథకంను అమలు చేస్తామని తెలిపింది . అంతే కాకుండా గోవధ …

Read More »

బ్రేకింగ్ : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరందుకుంది.ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రచారం నిర్వహిస్తుండగానే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. బీజేపీ తరుపున అభ్యర్థిగా జయానగర్ నుంచి విజయకుమార్ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఎన్నికల ప్రచారం సమయంలో ఒక ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే …

Read More »

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పుల దాడి

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం తమిళనాడులో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమెకు చేదు అనుభవం ఏర్పడింది.ఆమె కాన్వాయ్‌పై డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పుల దాడిచేశారు . కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటులో కేంద్ర ఆలసత్వానికి నిరసనగా వారు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్‌ స్వరాజ్‌ అభియోన్‌ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్‌నాథపురం, విరుధునగర్‌ జిల్లాలో ఆమె పర్యటించారు.ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు …

Read More »

నడిరోడ్డుపై బాలిక దుస్తులు చింపేసి 8 మంది మృగాళ్లు రెచ్చిపోయి దారుణం

బిహార్‌లోని జెహానాబాద్‌లో మృగాళ్లు రెచ్చిపోయారు. పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ బాలికపై ఎనిమిది మంది నీచులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. రహదారిపై వెళ్తున్న బాలికను అడ్డగించి ఆమె దుస్తులు విప్పేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు బాలిక ప్రయత్నించడంతో బలవంతంగా ఆమె దుస్తులు చింపేశారు. ఆమె కాలును పట్టుకొని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తనను వదిలేయమని ఎంత బతిమాలినా వినిపించుకోలేదు సరికదా మరింత పైశాచికానికి దిగారు. బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ …

Read More »

దేశ్‌కి నేత కేసీఆర్…సీఎం కేసీఆర్‌కు తమిళ ప్రజల బ్రహ్మరథం..!!

గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు టూర్ లో భాగంగా ఆదివారం చెన్నై పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే.ఈ పర్యటన సందర్భంగా సీ ఎం కేసీఆర్ కు అక్కడి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు .సీఎం కేసీఆర్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టు, కరుణానిధి నివాసం, స్టాలిన్ నివాసం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు . దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ తమిళంలో, హిందీలో పెద్ద ఎత్తున …

Read More »

కుమార్తెను తల్లిని చేసిన తండ్రి… మరణించే వరకు జైలు శిక్ష

మానసిక దివ్యాంగురాలైన 17 సంవత్సరాల తన కుమార్తెను తల్లిని చేసిన ఓ కామాంధునికి నాలుగు జీవిత ఖైదులు విధిస్తూ తంజావూరు మహిళా కోర్టు తీర్పు వెలువరించింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా శివకొల్లై ప్రాంతానికి చెందిన సుబ్రమణి (50) పెయింటర్‌. దినసరి కూలీ అయిన అతడి భార్య ఓ రోజు ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లితో చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. తర్వాత …

Read More »

ఘోర ప్రమాదం స్కూల్‌.. వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు..13 మంది చిన్నారులు అక్కడికక్కడే

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వేకువ ఝామున స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులతోపాటు డ్రైవర్‌ కూడా దుర్మరణం పాలయ్యారు. కుశినగర్‌ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన వ్యాన్‌ పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రైల్వే క్రాసింగ్‌ వద్ద దాటుతుండగా.. వేగంగా వస్తున్న రైలు …

Read More »

హైదరాబాద్‌ బయలుదేరిన బస్సులో ..!

బెంగళూరు నుంచి బుధవారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరిన కేఎస్‌ఆర్టీసీ బస్సు ‘ఐరావతం’ మంటల్లో చిక్కుకుంది. ప్రమాదాన్ని సకాలంలో గుర్తించడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. బస్సు బయలుదేరిన గంటలోగానే నగర శివార్లలోని దేవనహళ్లి వద్ద ఇంజిన్‌లో మంటలు రావడాన్ని డ్రైవర్‌ గమనించాడు. వెంటనే సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఆ సమయంలో సిబ్బందితోపాటు బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. వారంతా వేగంగా వాహనం దిగడంతో ముప్పుతప్పింది. అగ్నిమాపక దళాలు …

Read More »