Home / NATIONAL (page 75)

NATIONAL

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న Bad News

దేశంలో గత రెండు రోజులుగా  కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 1,192 మంది వైరస్తో మరణించారు. నిన్నటితో పోలిస్తే 250 అధికం. ఇక తాజాగా 2,54,076 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

దేశంలో కొత్తగా 2,34,281 మందికి  కరోనా

దేశంలో  కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక రోజులో దేశ వ్యాప్తంగా మొత్తం 2,34,281మంది కరోనా బారీన పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.10కోట్లకు చేరుకుంది.  తాజాగా నమోదైన కరోనా కేసుల్లో ఒక్క యాబై వేల కరోనా కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. గత ఇరవై నాలుగంటల్లో 893మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4,94,091కి చేరుకుంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,19,396 …

Read More »

ఒమిక్రాన్ తగ్గిన కానీ తప్పని ఆందోళన

ఒమిక్రాన్ బారినపడినా.. 3-4 రోజుల్లోనే ఎక్కువమంది కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా మందిలో గొంతుకే పరిమితమవడంతో .. ఆస్పత్రుల్లో చేరికలు స్వల్పంగా ఉంటున్నాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు తగ్గినా.. దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటివి మాత్రం వదలట్లేదు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడితే నయమవుతుందంటున్నారు నిపుణులు.

Read More »

జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు

రిపబ్లిక్ డే రోజు జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని  మరోమారు ఉద్ఘాటించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్‌ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ఓటర్ల …

Read More »

కరోనా పై Good News

దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ  కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మాత్రం కరోనా ఉధృతి మాత్రం కాస్త స్వల్పంగా తగ్గింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,55,874 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 20.75శాతం నుంచి 15.52శాతానికి తగ్గింది. 614మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 22,36,842 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

బీజేపీ కి గుడ్ బై చెప్పేసిన మాజీ సీఎం

గోవాలో బీజేపీకి మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. నిన్న‌టికి నిన్నే ఉత్ప‌ల్ ప‌ర్రీక‌ర్ రాజీనామా చేసిన సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. మాజీ సీఎం, సీనియ‌ర్ నేత ల‌క్ష్మికాంత్ ప‌ర్సేక‌ర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇక‌పై పార్టీలో కొన‌సాగాల‌ని అనుకోవ‌డం లేద‌ని, రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని ప్ర‌క‌టించారు. రాజీనామా త‌ద‌నంత‌రం ఏమిట‌న్న‌ది త‌ర్వాత ఆలోచించుకుంటాన‌ని ప‌ర్సేక‌ర్ పేర్కొన్నారు.బీజేపీ ప్ర‌క‌టించిన జాబితాలో ల‌క్ష్మికాంత్ ప‌ర్సేక‌ర్ పేరు లేదు. దీనిపై ఆయ‌న తీవ్ర …

Read More »

దేశంలో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (3,37లక్షలు) స్వల్పంగా తగ్గాయి. రోజువారి కోవిడ్ పాజిటివిటీ రేటు 17.78శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

ఢిల్లీలో కరోనా విజృంభణ

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల్లో తాజాగా పెరుగుదల కనిపించింది. కాగా.. ఒక్కరోజే 45 మంది కరోనా వల్ల మరణించారు. థర్డ్ వేవ్ ఇవే అత్యధికం. ఇదిలా ఉండగా.. 24గంటల వ్యవధిలో 70,226 టెస్టులు చేయగా.. 11,486 మందికి పాజిటివ్ గా తేలింది.

Read More »

సీఎం అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా

ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత  అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ తెలిపారు. ఇటీవల చరణ్ సన్నిహితుల ఇంట్లో ఈడీ దాడులు జరగ్గా.. ‘నిజాయితీ లేని వ్యక్తి’ అని కేజీవాల్ విమర్శించారు. దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కేజీవాల్ వ్యాఖ్యానించారని.. ఆయనపై దావా వేస్తానని చరణ్ జిత్ చెప్పారు. గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేసి.. కేజీవాల్ క్షమాపణలు …

Read More »

తొలిసారి అసెంబ్లీ నుండి బరిలోకి అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నసమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం  అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన మైన్ పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అఖిలేష్ ఇప్పటివరకు ఎమ్మెల్యేగా బరిలో నిలవలేదు. 2012లో ఎమ్మెల్సీ హోదాలోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు సీఎం యోగి గోరఖ్ పూర్ నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat