Home / Tag Archives: south central railway

Tag Archives: south central railway

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

  రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ ఓ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం ఉన్న రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు స్పెషల్ ట్రైన్స్ నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 4న సికింద్రాబాద్-పూరి, 5న పూరి-సికింద్రాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, 6న తిరుపతి-శ్రీకాకుళం, 7న శ్రీకాకుళం-తిరుపతి, 8న సికింద్రాబాద్-తిరుపతితో పాటు మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ నడిపించనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి ట్రైన్లు జనగామ, కాజీపేట, ఖమ్మం, విజయవాడ మీదుగా నడుస్తాయి.

Read More »

తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. అందుబాటులో స్పెషల్ ట్రైన్

తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి కానుకగా ఆగష్టు 31, సెప్టెంబరు 1(రేపు, ఎల్లుండి) రెండు ప్రత్యేక రైళ్లను తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. ఈ స్పషల్ ట్రైన్లు సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య తిరగనున్నాయని రైల్యే శాఖ పేర్కొంది. టైమింగ్స్ ఇవే.. స్పెషల్ ట్రైన్ నెం. 07120 రేపు ఆగష్టు 31న సాయంత్రం 6.15కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి …

Read More »

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తప్పిన ఘోర ప్రమాదం

కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్  ఆందోళనల సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలో ఆర్మీ అభ్యర్థులు పలు రైళ్లకు నిప్పు పెట్టిన సందర్భంలో పెను ప్రమాదం తప్పింది. ప్లాట్ ఫామ్ పై నం-1పై ఉన్న రైలు బోగీకి నిప్పంటించగా దానికి అతిసమీపంలోనే రైళ్లలో నింపే డీజిల్ ట్యాంక్ ఉంది. ఘటన సమయంలో అందులో 20వేల లీటర్ల డీజిల్ ఉంది. దానికి మంటలు అంటుకుని ఉంటే …

Read More »

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌ పరిధిలోని ఎంఎంటీఎస్‌ రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. రైలు ఛార్జీలను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 5 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఫలక్‌నుమా- సికింద్రాబాద్‌, హైదరాబాద్‌- లింగంపల్లి-రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ తగ్గింపు వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన …

Read More »

న్యూఢిల్లీ-కర్ణాటక Express Trainలో  బాంబు కలకలం

న్యూఢిల్లీ-కర్ణాటక Express Trainలో  బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తికి రైలులో క్యాటరింగ్ సిబ్బంది తీరు నచ్చలేదు. ఆగ్రహానికి గురైన అతడు సోదరుడికి చెప్పడంతో.. ఆ వ్యక్తి రైలులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో రైలు మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఫోన్ కాల్పై విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.

Read More »

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

 ఈనెల 30వ తేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. * రైలు నంబరు 02449-02450 షాలిమార్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.55కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

దేశంలో కరోనా లాక్ డౌన్ సడలింపుల తర్వాత ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా.. దక్షిణ మధ్య రైల్వే రైలు సర్వీసులను పునరుద్ధరిస్తోంది. తాజాగా ఏప్రిల్ 1 నుంచి విజయవాడ మీదుగా మరో 12 రైళ్లను ప్రారంభించనుంది. ఇందులో రోజువారి ఎక్స్ ప్రెస్, వారాంతపు సర్వీసులు ఉన్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగానే ద.మ రైల్వే నడపనుండగా.. ఈ రైళ్ల టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Read More »

తెలంగాణలో ఈ రైల్వే స్టేషన్లు మూసివేత.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దక్షి‌ణ ‌మధ్య రైల్వే పరి‌ధిలో ప్రయా‌ణి‌కుల రద్దీ, ఆదాయం లేని రైల్వే‌స్టే‌ష‌న్లను తాత్కా‌లి‌కంగా మూసి‌వే‌స్తు‌న్న‌ట్లుగా దక్షి‌ణ‌మధ్య రైల్వే ప్రక‌టిం‌చింది. ఫిబ్ర‌వరి 1 నుంచి రాష్ట్రంలో 29 స్టేష‌న్లను మూసి‌వే‌య‌ను‌న్న‌ట్లు అధికారులు తెలి‌పారు. ఇందులో నవాడ్గి, అంక్షా‌పూర్‌, మారు‌గుట్టి, పోడూరు, మామి‌డి‌పల్లి, కట్టాలి, కట్ల‌కుంట మేడి‌పల్లి, మైలారం, మహా‌గ‌నాన్‌, కొత్త‌పల్లి హావేలి, చిట్ట‌హాల్ట్‌, నంద‌గాన్‌ హాల్లి, గేట్‌ కారే‌పల్లి, నూక‌న‌ప‌ల్లి‌మ‌ల్యాల్‌, నగే‌శ్‌‌వాడి హాల్ట్‌, మృట్టి హాల్ట్‌, వలి‌వేడు, …

Read More »

ఏపీ ,తెలంగాణకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ షాక్

దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్‌) పరిధిలో నడుస్తున్న 72 రైళ్లకు అధికారులు త్వరలో ఉద్వాసన పలకనున్నారు. ఆయా రూట్లలో నష్టాలు, ఆక్యుపెన్సీ లేకపోవడం వంటి కారణాలతోపాటు.. ఇతర రైళ్లు, గూడ్సుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సీఆర్‌ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. ఈ రైళ్లన్నీ ఎస్సీఆర్‌ పరిధిలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్‌, గుంతకల్లు డివిజన్లలో సుదీర్ఘకాలం సేవలందించాయి. …

Read More »

బ్రేకింగ్ న్యూస్ – రైల్వేపాస్‌లు రద్దు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పాస్‌లను రద్దుచేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. విద్యార్థులు, నాలుగు క్యాటగిరీల దివ్యాంగులు, 11 క్యాటగిరీల రోగులు మినహా మిగతా అన్ని క్యాటగిరీల పాస్‌లను రద్దుచేసినట్టు చెప్పా రు. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 155, దక్షి ణ మధ్య రైల్వేలో 42 రైళ్లను ఈ నెల 31 వరకు రద్దుచేశామన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat