Home / Tag Archives: Telangana Police

Tag Archives: Telangana Police

అప్సర హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయం

సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ అతడితో విభేదాల కారణంగా ఏడాది కింద సరూర్ నగర్లోని పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలోనే ఇంటి సమీపంలోని ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తేవడంతో సాయికృష్ణ ఆమెను చంపేశాడు.

Read More »

సీఎం కేసీఆర్ పాలనలో పోలీసు శాఖ ఎంతో పురోగతి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనలో స్వరాష్ట్రంలో పోలీసు శాఖ ఎంతో పురోగతి చెందిందని హోం మంత్రి మహమూద్‌ అలీ  అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు  వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉందని చెప్పారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవం పేరుతో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు …

Read More »

హైదరాబాద్‌లో వైన్‌ షాపులు బంద్‌

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో వైన్‌ షాపులు మూత పడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్‌ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుశాఖ స్పష్టం చేసింది. కల్లు దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశించింది. వినాయక నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే …

Read More »

హైదరాబాద్‌లో ఎంపీ రఘురామపై కేసు నమోదు

ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసునమోదైంది. రఘురామ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సుభానిపై ఎంపీ సిబ్బంది దాడి చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్‌, కానిస్టేబుల్‌ సందీప్‌, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, పీఏ శాస్త్రిలను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More »

వాళ్లను కూడా మేజర్లగానే పరిగణించాలి: జూబ్లీహిల్స్‌ ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో మైనర్లను మేజర్లుగానే పరిగణించి శిక్షించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయంలో హైదరాబాద్‌ పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. మైనర్‌గా ఉన్న వ్యక్తులు  మేజర్‌లా క్రూరంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి పాల్పడితే వాళ్లను కూడా మేజర్‌గానే పరిగణించాలని.. జువైనల్‌గా చూడొద్దని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Read More »

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌పై కీలక అప్‌డేట్‌

జూబ్లీహిల్స్‌లో జరిగిన గ్యాంగ్‌రేప్‌ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో ముగ్గురిని ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి జువైనల్‌ జస్టిస్‌ బోర్డు అనుమతించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో ఆ నిందితులను పోలీసులు రేపటి నుంచి విచారించనున్నారు. లాయర్‌ సమక్షంలో విచారించి నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. మరోవైపు నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డును పోలీసులు కోరనున్నట్లు సమాచారం.

Read More »

ఆ ఫొటోలుఎమ్మెల్యే రఘునందన్‌కి ఎలా చేరాయబ్బా?

పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ తన ప్రెస్‌మీట్‌లో చూపించిన ఫొటోలు, వీడియోలపైనా పోలీస్‌ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై జూబ్లీహిల్స్‌లో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రఘునందన్‌ చూపించిన ఫొటోలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. నిందితుల ఫొటోలు, వీడియోలు …

Read More »

బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు ఉందన్న హెచ్చరికలతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నాంపల్లి పార్టీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం చేయాలని కార్యాలయం సిబ్బందికి పోలీసులు సూచించారు. జనవరి 26 వరకు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో గస్తీని ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని ఆదేశించారు

Read More »

కరోనాను సమిష్టిగా ఎదుర్కొందాం

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకంకావాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ను విజయవంతంగా పాటించడంలోనూ పోలీసులకు సహకరించాలని కోరారు. గురువారం డీజీపీ కార్యాలయం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. మానవాళికి చాలెంజ్‌ విసిరిన కరోనాను ఓడించడంలో ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిదని డీజీపీ పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి విపత్తును ఎదుర్కోవడంలో అందరి కృషి, చొరవ.. పోలీస్‌ సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తున్నదని, మరింత ఉత్సాహంగా పోలీసులు పనిచేసేలా సహకరించాలని …

Read More »

శభాష్ తెలంగాణ పోలీస్

దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరైన మేడారం జాతరలో ఏ విధమైన తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారణకు గాను తొలిసారిగా పోలీస్ శాఖ ఉపయోగించిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. మేడారం లో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రతి ఒక్క భక్తుడు సందర్శించి మొక్కులు సమర్పించే సందర్భం యంత్రాంగానికి ప్రతీ జాతరలోనూ ప్రధాన సవాలుగా ఉంటోంది. ఈసారి జాతర లో ఏ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat