టీడీపీ ఎమ్మెల్సీ పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్సీ  పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలుచేసారు . తెలుగు రాష్ట్రాలేమైనా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అబ్బ సొత్తా అని రామ్‌గోపాల్ వర్మ మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడంపై బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్లపై ఫేస్ బుక్ ద్వారా రామ్‌గోపాల్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తే రాజేంద్రప్రసాద్ తనను తెలుగు రాష్ట్రాల్లో తిరుగనివ్వనన్నాడని, అసలు రాజేంద్రప్రసాద్ ఎవడో తనకు తెలియదని చెప్పారు. రాజకీయాలను ప్రభావితం చేసిన ఎన్టీఆర్‌ను రోల్ మోడల్‌గా తీసుకోవాలని, ఎన్టీఆర్‌ నిర్ణయాలను ఫాలో అయిన వాడే నిజమైన ఫాలోవర్స్ అని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. 

సంబంధిత వార్తలు