'మహానుభావుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్

మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా తెరకెక్కింది. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, కథానాయికగా మెహ్రీన్ మెరవనుంది. ఈ సినిమాలో అతి శుభ్రత అనే మానసిక వ్యాధితో బాధపడే యువకుడిగా శర్వానంద్ కనిపించనున్నాడు. ఈ సినిమా పోస్టర్స్ కు .. టీజర్ .. ట్రైలర్ .. ఆడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో, టీమ్ అంతా కూడా ఎంతో హ్యాపీగా వున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 24న హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వేదిక ఎక్కడనేది ప్రకటిస్తారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'జై లవ కుశ' .. 'స్పైడర్' వంటి భారీ సినిమాలతో పోటీ పడుతుండటంతో, బలమైన కంటెంట్ వుండే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ సినిమాలతో ఎప్పుడు తలపడినా సక్సెస్ ను అందుకునే శర్వానంద్, ఈ సారి కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు