2016 ఉత్తమ క్రికెటర్ విరాట్ కోహ్లీ...

2016సంవత్సరానికి గాను దరువు.కామ్ ఉత్తమ క్రీడకారులకు, అవార్డులు ప్రకటిస్తోంది. ఇందుకు దరువు ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ప్రత్యర్థి ఎవరైన, ఏ స్టేడియమైనా ,ఫార్మట్ ఎదైన తన బ్యాట్ తో అద్భుత మైన షాట్లతో భారత క్రికెట్‌కు పర్యాయపదంగా మారిపోయాడు టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రతి యుద్ధంలోనూ తానే ఒక సైన్యమై దూసుకెళ్లాడు. సహచరులకు మార్గదర్శకంగా నిలిచాడు. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన అతి కొద్దిమంది క్రికెటర్లలలో కోహ్లీ ముందు వరుసలో నిలిచాడు. టెస్టుల్లోనేగాక, అన్ని ఫార్మెట్స్‌లోనూ అతను అద్వితీయ ప్రతిభ కనబరిచాడు.

ఐసిసి టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో భారత్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.పాకిస్తాన్‌పై ఐసిసి ప్రపంచకప్ టోర్నీల్లో టీమిండియాకు 11వ విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనూ కోహ్లీ తనదైన శైలిలో రాణించాడు. ఆసీస్ 160 పరుగులు సాధించి భారత్‌ను గెలిపించాడు. వెస్టిండీస్ టూర్‌కు వెళ్లినప్పుడు, ఆంటిగువాలో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించి, అన్ని ఫార్మాట్స్‌లోనూ రాణించే సత్తా తనకు ఉందని నిరూపించుకున్నాడు. 283 బంతులు ఎదుర్కొన్న అతను 24 ఫోర్లతో 200 పరుగులు చేసి,ఇన్నింగ్స్ 92 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది.

న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ 366 బంతుల్లో 211 పరుగులు చేశాడు.కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ భారత్‌కు కివీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసేందుకు ఉపయోగపడింది. కివీస్‌తోనే జరిగిన వనే్డ సిరీస్‌లోనూ కోహ్లీ తన బ్యాట్‌కు ఉన్న పదును ఎలాంటితో చూపించాడు.ధర్మశాలలో జరిగిన మొదటి వనే్డలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 190 పరుగులకు ఆలౌటైంది.అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు సాధించి, ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కోహ్లీ 81 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్‌కు సునాయాస విజయాన్ని అందించాడు. మొహాలీలో న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డలో కోహ్లీ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, భారత్‌ను విజయపథంలో నడిపాడు. న్యూజిలాండ్ 286 పరుగుల లక్ష్యాన్ని ఉంచుతూ విసిరిన సవాలును స్వీకరించిన కోహ్లీ తన బ్యాటింగ్ నైపుణ్యంతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.

తాజాగా ఇంగ్లాండ్‌తో ముగిసిగిన టెస్టు సిరీస్ నాలుగో టెస్టులో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబయిలో జరిగిన ఆ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అతను 515 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి, 340 బంతులు ఎదుర్కొని, 25 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 235 పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జేమ్స్ ఆండర్సన్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయితే, అతని విజృంభణ కారణంగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 631 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. అంతకు ముందు కివీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌట్ చేసిన కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 195 పరుగులకే కుప్పకూల్చి, ఇన్నింగ్స్ 36 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. 1932లో ఇంగ్లాండ్‌పై మొట్టమొదటి టెస్టు ఆడిన భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సిరీస్‌ను 4-0 ఆధిక్యంతో సొంతం చేసుకొని, కొత్త చరిత్ర సృష్టించింది. ఈ అసాధారణ విజయంలో కోహ్లీని హీరోగా అంగీకరించి తీరాలి.

సంబంధిత వార్తలు