పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ కు అరెస్ట్ వారెంట్..

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ కు కరాచీలోని స్థానిక సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గత ఏడాది జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి స్థానిక రిటైర్డ్ మేజర్ అమినుర్ రెహ్మాన్ పై వసీం అక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు దాదాపు 31 సార్లు ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. అయితే, ఇంతవరకు ఒక్కసారి కూడా వసీమ్ కోర్టుకు హజరుకాలేదు. కోర్టుకు గైర్హాజరు అవుతున్న క్రమంలోనే వసీం అక్రమ్ కు కోర్టు బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది వసీం అక్రమ్ ప్రయాణిస్తున్న బెంజ్ కారును మాజీ మేజర్ తన కారుతో ఢీకొట్టాడు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న వాగ్వాదంలో.. వసీంను మేజర్ తన రివాల్వర్ తీసి బెదిరించాడు. ఈ క్రమంలో, కొందరు పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో, ఇద్దరూ కోర్టు విచారణకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం తన జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్ గా ఉన్న అక్రమ్.... జట్టుతో పాటు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మరోవైపు, ఇద్దరూ జనవరి 17న జరిగే తదుపరి విచారణకు హాజరు కావాల్సిందేనంటూ కోర్టు ఆదేశించింది

సంబంధిత వార్తలు