వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన నిర్ణయం ...

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన యువ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అవినాష్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచిన సంగతి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నయానో ..భయానో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను బెదిరిస్తూ తమ పార్టీలో చేర్చుకుంటున్న సంగతి విదితమే .

ఈ క్రమంలో పార్టీల నుండి నేతలను చేర్చుకోవడం ..ప్రజా సంక్షేమాన్ని పక్కన పెడుతున్నాడు .ఈ నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలో రైతులు పలు సమస్యలను ఎదుర్కుంటున్నారు .ఈ సమస్యల పై ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ "అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఎప్పుడు కూడా రైతులు త్రాగునీరు లేదా సాగునీరు కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు..రాస్తోరోకులు చేయలేదు.

కానీ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఇదే మైదుకూరులో సాగు నీరు కోసం రైతులు మూడు సార్లు ధర్నాలు,రాస్తోరోకులు చేశారు.ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 864.3 అడుగులు నీరు వచ్చినా ఇంత వరకు ఐఏబీ మీటింగ్‌ పెట్టలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఐఏబీ మీటింగ్‌ పెట్టి కేసీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలి . టీడీపీ ప్రభుత్వానికి అక్టోబర్‌ 1వ తేది వరకు గడువు ఇస్తున్నాం.కేసీ ఆయకట్టుకు నీరు అందించే విషయంపై స్పష్టత ఇవ్వకపోతే అక్టోబర్‌ 2 ఉదయం నుంచి రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తా అంటూ ఆయన సంచలన నిర్ణయం ప్రకటించారు .

సంబంధిత వార్తలు