బాహుబలి టీజర్...

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉంది. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీం ఒక వైపు తమ సినిమాకు సంబంధించిన పనులు చూసుకుంటూనే మరో వైపు వినూత్న ప్రమోషన్స్ చేస్తోంది. ఆ మధ్య వీఆర్ ఎక్స్ పీరియెన్స్ అంటూ కొత్త టెక్నాలజీ పరిచయం చేసిన జక్కన్న దీంతో మనం మాహిష్మతి రాజ్యంలో ఉండే ఫీల్ ని కలిగిస్తానని చెప్పాడు. ఇక త్వరలో రాబోవు టీజర్, ట్రైలర్ ని కూడా వీఆర్ ఎక్స్ పీరియన్స్ ద్వారా చూడొచ్చని ఆయన అన్నారు. అయితే హైదరాబాదీస్ కోసం టీజర్ ద్వారా వీ ఆర్ ఎక్స్ పీరియన్స్ ని పరిచయం చేయబోతుంది బాహుబలి చిత్ర యూనిట్ . ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఈ రోజు నుండి 13వ తేదీ వరకు ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి పేరిట చిత్ర టీజర్ ని ప్రదర్శించనున్నట్టు టీం తెలిపింది. ఈ వీ ఆర్ ఎక్స్ పీరియెన్స్ తో ఈ టీజర్ ని వీక్షించి అందరం గొప్ప అనుభూతిని పొందవచ్చని మేకర్స్ అంటున్నారు.

సంబంధిత వార్తలు