ఖైదీ నెంబర్‌ 150పై బాల‌కృష్ణ కామెంట్స్..

ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గౌతమిపుత్రశాతకర్ణి’ ఈ రెండింటిలో ఏది ఘన విజయం సాధిస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక, ఆయా హీరోల అభిమానుల హడావిడికి అయితే హద్దే లేదు. సోషల్‌ మీడియా వేదికగా ఇరు హీరోల అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే బాలయ్య సినిమా విజయవంతం కావాలని చిరు పలు ఇంటర్వ్యూలో చెప్పగా, ఇప్పుడు బాలయ్య కూడా ‘ఖైదీ’ గురించి మాట్లాడాడు. ‘ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకు మంచి విందు భోజనమే. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. నాకు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంత ముఖ్యమో చిరంజీవికి ‘ఖైదీ నెంబర్‌ 150’ కూడా అంతే. ఈ రెండూ తెలుగు ప్రేక్షకులను అలరించాలని, ఘనవిజయాలు సాధించాలని కోరుకుంటున్నా. సంక్రాంతికి రెండు మూడు సినిమాలు పోటీ పడడం ఎప్పుడూ జరిగేదే. అందులో కొత్త ఏమీ లేదు. ఈ సంక్రాతికి చిరంజీవి సినిమాతోపాటు విడుదలవుతున్న సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా. చిరంజీవికి ఆల్‌ ది బెస్ట్‌’ అని బాలయ్య అన్నారు.

సంబంధిత వార్తలు