అనాధ మహిళలకు బతుకమ్మ చీరలు...

గత మూడు రోజులనుండి  ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బతుకమ్మ చీరలను  మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీర సారె పెట్టడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందని ఆడపడుచులు ముచ్చటించుకుంటున్నారు.ఈ క్రమంలో  మహిళా సంఘాల స్త్రీలకే కాకుండా సమాజంలోని పలు వర్గాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుంది. ఈ మేరకు బతుకమ్మ చిరు కానుకలను సంబంధిత మహిళలకు అందజేయాల్సిందిగా పేర్కొంటూ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, సామాజిక సేవా సంస్థలు, రిమాండ్ మహిళా ఖైదీలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందజేయనుంది. హైదరాబాద్‌లోని సేవా సంస్థల మహిళలకు చీరలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ పంపిణి చేయనున్నారు. అదేవిధంగా జిల్లాల్లోని సేవాసంస్థల్లో కలెక్టర్లు సంబంధిత మహిళలకు చీరలు అందించనున్నారు.
 

సంబంధిత వార్తలు