‘బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ

‘బిగ్ బాస్’ సీజన్ -1 విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు.‘బిగ్ బాస్’ సీజన్ -1 ఈ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’  ఫైనల్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ సీజన్ -1 విజేతను ఈ షో వ్యాఖ్యాత జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ‘బిగ్ బాస్’ ఫైనల్ లో శివబాలాజీ, ఆదర్శ్ నిలిచారు.  ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ ట్రోఫీని, మనీ ప్రైజ్ ని జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు అందజేశాడు. ఈ సందర్భంగా శివబాలాజీని తోటి ఆర్టిస్టులు ప్రశంసించారు. కాగా, ఈ వేడుకకు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ లు హాజరయ్యారు. ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ లకు పలు కేటగిరిల్లో అవార్డులను జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించగా, ఆయా అవార్డులను సంబంధిత ఆర్టిస్ట్ లు అందుకున్నారు.గెలుపొందిన శివబాలాజీ మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో గడిపిన తీపి గుర్తులను ఏ నాటికీ మర్చిపోలేనని అన్నారు. తను గెలుపొందాలని ఫోన్ల ద్వారా ఓటింగ్ చేసిన వాళ్లందరకీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు