హద్దులు దాటిన అభిమానం -టికెట్ దొరకలేదని బ్లేడ్ తో గొంతు కోసుకున్నడు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలోని రామా టాకీస్ వద్ద తన అభిమాన నటుడు చిరంజీవి కొత్త చిత్రం టికెట్ తనకు లభించలేదన్న ఆగ్రహంతో, ఓ వీరాభిమాని రెచ్చిపోయాడు. మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకుని రచ్చ చేశాడు. దీంతో  సదరు అభిమాని మెడకు గాయం కాగా, ఆసుపత్రికి తరలించాలని థియేటర్ యాజమాన్యం ప్రయత్నించింది. చికిత్స చేయించుకునేందుకు వెళ్లేది లేదంటూ, మూర్ఖంగా ప్రవర్తించిన అతను, టికెట్ ఇస్తేనే వెళతానని, లేకుంటే చచ్చిపోతానని అక్కడున్న వారిని హడలెత్తించాడు. చివరికి పోలీసులు వచ్చి అతన్ని అదుపు చేయాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు