నగరిలో గాలి‌కి వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు....!

CHANDRABABU BIG HAND TO GALI MUDDU KRISHMANAIDU...!

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌ ఎవరని అడగ్గానే ఏపీ సీఎం  చంద్రబాబు పేరు ఠక్కున వస్తుంది.   అధికారం సొంత మామకే కాదు..అవసరం తీరాకా తనను నమ్ముకున్నవారికి, అత్యంత ఆప్తులైన వారికి కూడా వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడడు.   చంద్రబాబు నమ్మకద్రోహం, కుటిల మనస్తత్వం తట్టుకోలేక టీడీపీ నుంచి కోటగిరి విద్యాధర్ రావు, సి. రామచంద్రయ్య లాంటి ఎంతో మంది సీనియర్ నాయకులు నిష్క్రమించారు..అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న అతి కొద్ది మంది నాయకుల్లో ప్రస్తుత నగరి ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఒకరు. గతంలో ఎన్గీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబును వ్యతిరేకించిన గాలి ఆ తర్వాత  కాంగ్రెస్‌లో చేరారు..వైఎస్ మరణం తర్వాత టీడీపీలొ చేరారు ఇలా ఒకటికి రెండు సార్లు పార్టీ మారిన చరిత్ర గాలిది. 

 అయితే గత ఎన్నికలకు ముందు నుంచి టీడీపీలో కొనసాగిన గాలి ముద్దు కృష్ణమనాయుడు నగరి నుంచి పోటీ చేశారు కూడా. అయితే వైసీపీ తరపున పోటీ చేసి రోజాను గాలి లైట్ తీసుకున్నారు..ఆమెపై అవలీలగా గెలిచేస్తాననే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సరిగా ప్రచారం కూడా చేయలేదు..దీంతో స్వల్ఫ మెజార్టీతో ఆమె చేతిలో ఓటమి పాలై పరపతి పోగొట్టుకున్నారు..రోజా చేతిలో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేని గాలి కొంత కాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు..ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు కోసం బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు..ముందు ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాత మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆశతో చంద్రబాబు మెప్పు పొందడం కోసం ప్రతి రోజు ప్రెస్‌మీట్లు పెట్టి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై లక్ష కోట్లు, సిబిఐ కేసులు, వారం వారం కోర్టు మెట్లు అంటూ గొంతు చించుకునేవాడు..అయితే గాలి నస భరించలేక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన చంద్రబాబు మంత్రి పదవి మాత్రం ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు..బాబు తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన గాలి తన దూకుడు  తగ్గించి సైలెంట్ అయ్యాడు..కాగా నగరి తెలుగు తమ్ముళ్లు గాలికి ఎసరు పెట్టాలని భావిస్తున్నారు..అందుకే మలయాళీ ముద్దుగుమ్మ , మాజీ హీరోయిన్ వాణి విశ్వనాధ్‌ను రంగంలో దింపారు..వాణి విశ్వనాథ్ అప్పుడే రోజాతో పోటీకి నేను రెడీ అంటోంది...

 అసలు చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకుని పార్టీలో చేరకముందే వచ్చే ఎన్నికల్లో  వైసీీపీ ఎమ్మెల్యే రోజాను ఓడించేందుకు టీడీపీ అభ్యర్థిగా వాణి విశ్వనాథ్ పోటీ చేస్తున్నట్లు అటు నగరిలో ఇటు ఎల్లోమీడియాలో ప్రచారం జరుగుతోంది. తన సొంత నియోజకవర్గంలో టీడీపీలో జరుగుతున్న పరిణామాలు గాలికి మింగుడుపడడంలేదు. టీడీపీలోనే ఉండాలా వైసీపీలో చేరాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు..టీడీపీలోనే అత్యంత సీనియర్ నాయకుడైన గాలి పరిస్థితిని చూసి ఎమ్మెల్యే రోజా వైసీపీలో చేరండి..మీ సీనియారిటీకి తగిన గౌరవం జగన్ ఇస్తారు అంటూ ఆఫర్ ఇచ్చింది..ఇదిలా ఉండగా నగరి టీడీపీలో వాణీ విశ్వనాథ్ ఎంట్రీ వెనుక చంద్రబాబు హస్తం ఉందని నగరి టీడీపీలో చర్చ జరుగుతోంది... ఇప్పుడు గాలితో పెద్దగా అవసరం లేదని భావిస్తున్న చంద్రబాబు ఆయన్ని వదిలించుకోవడానికే  వాణీ విశ్వనాథ్‌ను తెర మీదకు తీసుకువచ్చేలా  తెలుగు తమ్ముళ్ల చేత డ్రామా ఆడిస్తున్నాడని నగరిలో చర్చ  రుగుతోంది. తనను నమ్ముకున్న పెద్దాయన గాలికి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడవడం నగరిలో హాట్ టాపిక్‌గా మారింది.. అయినా.పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి ఆ‍యన మరణానికి కారకుడైన
చంద్రబాబుకు గాలి లాంటి నాయకులు ఓ లెక్కా. ఏంటీ..బాబుగారికి అవసరం తీరాక ..జూనియర్ ఎన్టీఆర్ అయినా, పవన్ కల్యాణ్ అయినా, గాలి అయినా ఎవరైనా సరే అందరూ కరివేపాకులే...

సంబంధిత వార్తలు