ప్రపంచమంతా చిరు మేనియాలో మునిగితే.. కనీసం పవన్ కలవలేదు.. కారణమెవరు.?

పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తెలుసుకోవాలి.. ప్రపంచమంతా తన అన్నయ్యను ఆకాశానికెత్తుతున్నా తానెందుకు అన్నయ్యకు దూరంగా ఉంటున్నాడో తెలుసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150కి వీలైనంత హైప్ తీసుకువచ్చేందుకు మెగా ఫ్యామిలీ అంతా కసరత్తులు చేసింది. ముఖ్యంగా రాంచరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ లు అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టేసి ఖైదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను సక్సెస్ చేసేందుకు కష్టపడ్డారు. మెగా హీరోలందరినీ ఒకే వేదిక మీదకు వచ్చి మెగా కంబ్యాక్కు మరింత హైప్ తీసుకొస్తారని అంతా భావించారు. కానీ పవన్ అటువైపు కన్నెత్తికూడా చూడలేదు.  కొంత కాలంగా మెగా ఈవెంట్లకు దూరంగా ఉంటున్న పవన్ ను ఈ వేడుకకు తీసుకు రావాలని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. అందరూ ఊహించినట్టే పవన్‌ ఈ వేడుకకు హాజరుకాలేదు. అంతకుముందు ఈ సినిమా గురించి స్పందించిన ట్విట్టర్‌లో పవన్‌ కల్యాణ్‌ స్పందించిన సంగతి తెలిసిందే..

చరణ్, మా వదిన సురేఖగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు' ఆయన అంటూ ట్వీట్ చేశాడు. అయితే పవన్ టీడీపీకి ఎంతో మేలు చేశాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.. అయినా ఆయన అన్న ఫంక్షన్ కు చంద్రబాబు ఆటంకాలు క్రియేట్ చేశారు. ఈ నేపధ్యంలో చిరంజీవి అభిమానులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలకు విజయవాడలో, గుంటూరులో అనుమతి ఇవ్వలేదని చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు నిరసన తెలిపారు.

సినీ పరిశ్రమను ఏపీకి తరలిస్తామని ప్రగల్భాలు పలికే చంద్రబాబు.. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 కొత్త చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలకు నగరంలో అనుమతి ఇవ్వకుండా సినీ పరిశ్రమను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఓ మాజీ కేంద్రమంత్రి అనే కనీస గౌరవం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాటే ధియేటర్లు కూడా చిరు సినిమాకు ఇవ్వలేదని తెలుస్తోంది. పైగా రైతు కష్టాలపై సినిమా వచ్చిన నేపధ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ సినిమా గురించి టీడీపీ డిజిటల్ సేన సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. పైగా ఈ సినిమా విడుదలై ప్రపంచ దేశాల్లో మెగా మేనియా అంటే ఎంటో తెలిసేలా దుమ్ము లేపుతోంది. అయినా పవన్ కనీసం తన అన్నయ్యను కలవలేదు. గతంలోనే పవన్ హాయ్ ల్యాండ్ లో వేడుకకు వెళ్లనందుకు అభిమానులు దుమ్మెత్తిపోసారు. ఇకనైనా కనీసం డిగ్రీకూడా లేని తనకు పెంచి పెద్దచేసి పెద్దస్టార్ ని చేసిన అన్నయ్యకు అండగా నిలబడాల్సిన అవసరం వచ్చిందని పవన్ ఇకనైనా రాజకీయ విబేధాలు పక్కన పెట్టి అన్నయ్య  చెంతకు చేరాలని అభిమానులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు