బాలయ్య చిత్రానికి వినోదపు పన్నుమినహాయించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు.. మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు...!

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టాలీవుడ్ కు మరింత ఊపు వచ్చింది..సీఎం కేసీఆర్ హైదరాబాద్ సెటిలైన సినీ పరిశ్రమకు అన్నివిధాలు ప్రోత్సాహం ఇస్తున్నారు..సినీ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు..పేద సినీ కళాకారులకు పింఛన్లు ఇస్తున్నారు..టాలీవుడ్ సినీ పరిశ్రమకు పలు రాయితీలు ప్రకటిస్తున్నారు..తాజాగా రుద్రమదేవి, గౌతమి పుత్ర శాతకర్ణి లాంట చారిత్రక చిత్రాలకు వినోదపు పన్ను రాయితీలు కల్పించారు..దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతగానో ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.  కళలు, కళాకారులపై ఆయన చూపిస్తున్న చొరవ అమోఘమని చిరు అన్నారు..ప్రత్యేకంగా   గౌతమీపుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను మినహాయించడంపై హర్షం వ్యక్తం చేశారాయన. సీఎం కేసీఆర్  ప్రోత్సాహంతో తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ మరింత ఉన్నతస్థాయికి వెళ్తుందని చిరంజీవి తెలిపారు.
 

సంబంధిత వార్తలు