సీఎం కేసీఆర్ నిర్ణ‌యానికి ఇంకో భాషా ప్ర‌ముఖుడు ఫిధా

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు భాష సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణ‌యానికి మ‌రో ప్ర‌ముఖుడు ఫిదా అయ్యారు. తెలుగు బాషా విధానంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న విధానానికి ధన్యవాదాలని ప్ర‌ముఖ సాహితివేత్త‌,ప‌ద్మ‌భూష‌ణ్‌ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్ర‌శంసించారు. సీఎం కేసీఆర్ చాలా విప్లవత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

ఢిల్లీలో ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ 1 తరగతి నుంచి 12 వ తరగతి వరకు తెలుగు బాషా ను  పాఠశాలలో చేర్చడం ఆభినంధించాల్సిన విషయమ‌న్నారు. శిలా ప‌లకాలు, నామ పలకాలు తెలుగులో ఉండాలని నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమ‌ని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్నా నిర్ణయానికి తెలుగు వాడిగా గర్విస్తున్నానని తెలిపారు. తెలుగు భాష విధానంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి నేను సిగ్గు పడుతున్నాన‌ని యార్ల‌గ‌డ్డ పేర్కొన్నారు. ఏపీ సీఎం సమక్షంలోనే శిలా పాలకలు, నామ పలకాలు తెలుగులో వుండాలని నిర్ణయం తీసుకున్న ఇప్పటికి అదికారులు ఇంగ్లీష్ లో రాస్తున్నారని తెలిపారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు  తీసుకున్నా నిర్ణయానికి అదికారులు విలువ ఇవ్వడం లేదని యార్ల‌గ‌డ్డ అన్నారు. తెలంగాణ,ఆంద్రప్రదేశ్ లో 5 తెలుగు విశ్వ విద్యాలయాలు ఉన్నాయని వీటి ఆంధ్రాలో మూడు, తెలంగాణ లో 2 ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో  రెండు తెలుగు విశ్వ విద్యాలయాలో 16 తెలుగు కోర్సులు ఉన్నాయని పేర్కొంటూ ఆంధ్రలో 3 తెలుగు విశ్వ విద్యాలయాలు ఉన్నా కేవలం 3 తెలుగు కోర్సులు ఉన్నాయ‌న్నారు. తెలంగాణాలోని  తెలుగు విశ్వవిద్యాలయాలలో గత మూడు సంవత్సరాలుగా ఒక్క ఆంధ్ర విద్యార్ధి  కూడా అడ్మిషన్ తీసుకోలేదు వెంటనే ఆంద్రప్రదేశ్  ప్రభుత్వం చోరవ తీసుకొవాలని కోరారు.

సంబంధిత వార్తలు