చంద్రబాబు కులపిచ్చి, బంధు ప్రీతిపై నిప్పులు చెరిగిన స్టార్ డెరక్టర్.. ఈ సారైనా న్యాయం చేయండి...

ఏపీ సీఎం చంద్రబాబు నాయడికి కులపిచ్చి ఎక్కువని, తన సామాజిక వర్గీయులకే పెద్ద పీట వేస్తాడని రాజకీయ నాయకులు తరచుగా విమర్శిస్తుంటారు.. అయితే సినిమాపరంగా కూడా చంద్రబాబు వర్గీయులకే అన్ని రాయితీలు కట్టబెడతాడని తాజా ఘటననుద్దేశించి సినీ ప్రముఖులు అంటున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత గాథ ఆధారంగా బాలయ్య హీరోగా నటించిన గౌతమి పుత్రశాతకర్ణి చిత్రానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు వినోదపు పన్నును ప్రకటించారు.. అయితే ఏపీ సీఎం చంద్రబాబు తన బావమరిది నటించిన చిత్రానికి వినోదపు పన్నును ప్రకటించారు కానీ.. నేను తీసిన రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్నును మినహాయించాలని కోరినా స్పందించలేదు.. బావ మరిదికో న్యాయం.. నాకో న్యాయమా అంటూ డైరెక్టర్ గుణశేఖర్ చంద్రబాబుపై నిప్పులు చెరిగాడు. రాణి రుద్రమదేవి కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని, ఆమె సామ్రాజ్యం ఆంధ్రాకు విస్తరించిందని.. ఆంధ్రాను కూడా పాలించిందని గతంలో మీరే సెలవిచ్చారు.. కానీ నేను ఎన్నో వ్యయ ప్రయాసలు కోరి భారత దేశం గర్వించదగిన మహారాణి రుద్రమేదేవి చిత్రాన్ని నిర్మించాను.. వినోదపు పన్నును మినహాయించండి అని ఆర్టీ పెట్టగానే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు వెంటనే స్పందించి వినోదపు పన్నును మినహాయించారు..

కానీ మీరు మాత్రం ఆ దరఖాస్తును పరిశీలించడానికి ఓ కమిటీ వేయమని చెప్పి, ఆ తర్వాత అర్థాంతరంగా ఫైలు మూసినట్లు తెలియజేశారు.. ఆ తర్వాత నేను ఎన్ని సార్లు అధికారులను, మిమ్మల్నికలవాలని శతవిధాల ప్రయత్నించినా ఫలించలేదు.. కానీ మీ బావమరిది బాలయ్య చిత్రానికి వినోదపు పన్నును మినహాయించడాన్ని అభినందిస్తున్నా..  అలాగే గతంలో నా చిత్రానికి కూడా  వినోదపు మినహాయించినట్లయితే నాకు ఆర్థికంగా ఉపశమనంగా ఉండేది.. దీంతో నేను నిరాశ చెందాను.. కనీసం ఇప్పటికైనా నా దరఖాస్తును పునఃపరిశీలించి  ఏపీలో రుద్రమదేవి చిత్రానికి వసూలు చేసిన మొత్తానికి సమానమైన ప్రోత్సాహ నగదును అందచేసి మీరు బంధు పక్షపాతి కాదు అందరి పట్ట నిప్పక్షపాతంగా వ్యవహరిస్తారని , పారదర్శకంగా పని చేస్తారని మరోసారి రుజువు చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ గుణశేఖర్ చంద్రబాబు బంధు ప్రీతిని బయపెడుతూ తెగ సెటైర్లు వేశాడు. అయితే గుణశేఖర్ విన్నపాన్ని చంద్రబాబు ఆలకిస్తారా లేక గతంలో అర్జీపై కమిటీ వేసి తర్వాత అర్ధాంతరంగా ఫైలు మూసినట్లు చేస్తారా అనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు