నటుడు ఓంపురి మరణం సహజం కాదు .. హత్య -ఓంపురి డ్రైవర్ రాంప్రమోద్ సంచలనాత్మక ప్రకటన ..

ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు ఓంపురి సహజంగా మరణించలేదా ..?ఆయన్ని ఎవరు అయిన  హత్య చేశారా.. ?అందరు అనుకుంటున్నట్లు ఆయన గుండెపోటుతో కాకుండా తలపై కొట్టటం వల్లే చనిపోయారా?ఇలాంటి అనుమానాలు అయన చనిపోయిన దగ్గర నుండి  రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే నటుడు ఓంపురి మరణం వెనక మిస్టరీ ఉందని చాలా మంది తమ  అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. ఓంపురి దగ్గర దాదాపు 25ఏళ్లుగా ఆయన కారు డ్రైవర్ గా పని చేస్తున్న రాంప్రమోద్ మిశ్రా చెబుతున్న విషయాలు షాక్ కు గురిచేస్తున్నాయి. ఒక ప్రముఖ  జాతీయ ఛానల్ తో మాట్లాడిన డ్రైవర్.. ఓంపురి మరణానికి 12 గంటల ముందు ఏం జరిగిందో ఆయన వివరించాడు.
అసలు ఏమి జరిగిందో ఓంపురి డ్రైవర్ రాంప్రమోద్ మిశ్రా మాటల్లోనే..
జనవరి 5వ తేదీ సాయంత్రం నిర్మాత ఖలీద్ ఓంపురి ఇంటికి వచ్చారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. డ్రింక్ కూడా చేస్తున్నారు. రాత్రి ఏడు గంటల వరకు నేను ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాను. ఉదయం ఆరు గంటల సమయంలో నిర్మాత ఖలీద్ కిద్వాయ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ సార్ ఓంపురి పర్స్ నా కారులో పడి ఉంది.. వచ్చి తీసుకువెళ్లు అని చెప్పాడు. మా సార్ పర్స్ మీ కారులో ఏంటీ అని అడిగాను. రాత్రి ఇద్దరం బయటకు వెళ్లాం.. కారులో పడిపోయింది అని చెప్పాడు. నేను కిద్వాయ్ ఇంటికెళ్లి పర్స్ తీసుకుని.. ఓంపురి ఇంటికి వచ్చాను. ఉదయం 7 గంటల నుంచి 7.30 గంటల వరకు తలుపుకొట్టినా తీయలేదు. ఓ పక్కనే ఉన్న మరో భార్య ఇంటికెళ్లి రెండో తాళం తీసుకొచ్చి.. తలుపు తీసి చూశాను. బెడ్ రూంలో కూడా లేరు. ఇళ్లంతా వెతికితే..  ఓంపురి మృతదేహం వంట గదిలో పడి ఉంది. ఆయన ఒంటిపై బట్టలు లేవు. నగ్నంగా ఉన్నారు. తల వెనక భాగంలో గాయం అయ్యి ఉంది. వంట గది మొత్తం రక్తపు మడుగు ఉంది. సహజ మరణంగా అనిపించటం లేదు. ఒంటిపై దుస్తులు ఎవరు తొలగించి ఉంటారో తెలియటం లేదు. నేను ఓంపురి దగ్గర 25 సంవత్సరాలుగా డ్రైవర్ గా పని చేస్తున్నాను అని వివరించారు. 

సంబంధిత వార్తలు