ఎడిటోరియల్ : కోదండరామ్ సార్..మీకిది తగునా...!

గత కొంత కాలం గా తెలంగాణ ప్రభుత్వంపై చిర్రుబుర్రలాడుతున్న కోదండరామ్ మాష్టారు..మళ్లీ బుస కోట్టారు...నిన్న తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ముంపు గ్రామాల నిర్వాసితులతో ఎర్ర పార్టీల భవనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టారు మన మాష్టారు..తెలంగాణ ప్రభుత్వం నిర్వాసితుల దగ్గర గ్యాంగ్ స్టర్ నయీం తరహాలో భూములు లాక్కుంటుందని దారుణమైన వాఖ్యలు చేశారు..అసలు తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో గానీ, పాలమూరు ప్రాజెక్ట్ నిర్వాసితుల విషయంలో గానీ ఇంతకు ముందు పాలకులు ఎవరూ చూపనంత  పారదర్శకంగా వ్యవహరించింది.గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికంటే ఎక్కువగా  నష్టపరిహారం ఇవ్వాలని  123 జీవో దారి తీసింది. ఈ జీవో ప్రకారం 2013 భూసేకరణ చట్టం ద్వారా అయితే ఒక్కో రైతుకు ఒక ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర కూడా పరిహారం అందదు..కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి 5 నుంచి 6 లక్షల నష్టపరిహారం ఇచ్చేలా 123 జీవో జారీ చేసింది.. అంతేకాదు భూ సేక‌ర‌ణ చ‌ట్టం 2013 ప్రకారం చెల్లించేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కూడా ప్రకటించింది.. పున‌రావాసం,
న‌ష్టప‌రిహారం చెల్లించే విష‌యంలో భూ నిర్వాసితులు ఎలాంటి ఆందోళ‌న‌కు గురికావ‌ద్దని భరోసా ఇచ్చారు.అంతే కాదుమల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను అతి తక్కువ ముంపు ఉండేలా డిజైన్ చేశారు...కేవలం 8 గ్రామాలు మాత్రమే ముంపుకు గురవుతాయి. కానీ  కాంగ్రెస్ , సీపీఎం, టీడీపీ పార్టీల ముంపు గ్రామాల ప్రజల్లో లేని పోని భయాందోళనలు రేపి విధ్వంస రచనకు పూనుకున్నాయి..కానీ ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరించి ప్రతిపక్షాల ఆందోళనకు చెక్ పెట్టింది.అలాగే పాలమూరు
రైతులకు కూడా, నష్టపరిహారం అందించింది..అయితే నిర్వాసిత గ్రామాల్లో భూముల్లేని నిరుపేదల విషయంలో కాస్త సందిగ్ధత ఉంది..వారికి ఏ మేరకు నష్టపరిహారం అందించాలన్న విషయంలో ప్రభుత్వం తగిన విధివిధానాలను ప్రభుత్వం రూపొందిస్తుంది..ఇదే విషయంపై హైకోర్ట్ లో కూడా చెప్పింది..దీంతో హైకోర్ట్  కూడా ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో ప్రభుత్వం చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంది..మల్లన్న సాగర్ ప్రాజెక్ట్  నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లచ్చు అని చెప్పింది..కానీ కోర్టులు చెప్పినా మన కోదండరామ్ మాష్టారు మాత్రం ఇంకా భూనిర్వాసితులను రెచ్చగొడుతున్నారు..నిజంగా మేష్టారుకు చిత్త శుద్ధి ఉంటే వారినందరిని కమ్యూనిస్టుల భవనంలో కూర్చోబెట్టి రెచ్చగొట్టరు..వారిని సరాసరి సీఎం క్యాంపు ఆఫీసుకు తీసుకెళితే కేసీఆర్ గారు మాత్రం వద్దంటారా..ఎందుకో మీకు ఏమైనా ఇగో సమస్యలు ఉన్నాయా..రైతుల కోసం ఆ మాత్రం ఇగోను పక్కన పెట్టలేరా..

   ఇంకో విషయం మీరు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి వెన్నంటే ఉన్నప్పుడు యావత్ తెలంగాణ మిమ్మల్ని మా కోదండ రామ్ సార్ అని భుజానకి ఎత్తుకున్నారు..కేసీఆర్ తర్వాత మిమ్మల్నే అంతటి నాయకుడిగా చూశారు..అదే మీలో ఇగో  పెంచిందా...ఇక తెలంగాణను దోచుకున్న కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో కల్సి మీరు ప్రభుత్వంపై కత్తి దూస్తున్నారు..ఇదే కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ల పాలనా కాలంలో సీమాంధ్రకు అక్రమంగా నీరు తరలించుకునిపోయేందుకు పులిచింతల ప్రాజెక్ట్ ను నిర్మించినప్పుడు..అప్పుడు తెలంగాణ ప్రాంతంలోని 20 గ్రామాల్లో భూములు కోల్పోయింది మన తెలంగాణ రైతన్నలే సార్..అప్పుడు మీరు ఇప్పుడు వంత పాడుతున్న ఘనత వహించిన కాంగ్రెస్ నాయకులు ఎంత నష్టపరిహారం ఇచ్చారో తెలుసా...కేవలం 80 వేలు ..అది కూడా ఇప్పుడు మీరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ నియోజకవర్గమే.. పులిచింతల నిర్వాసితులు నష్టపరిహారం కోసం కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా
తిరిగారు...వారికి సరైన నష్ట పరిహారం, పునరావాసం కల్పించలేదు గత కాంగ్రెస్ పాలకులు..అప్పుడు మీరు ఈ గడ్డపైనే ఉన్నారు..తెలంగాణ ఉద్యమంలోనే యాక్టివ్ గానే ఉన్నారు..ఓ పక్క టీఆర్ ఎస్ పార్టీ పులిచింతల ప్రాజెక్ట్ విషయంలో ఎన్నో ఆందోళనలు నిర్వహించింది..మరి ఆ సమయంలో కోదండరామ్ గారు పులిచింతల బాధితుల తరపున ఎందుకు మాట్లాడలేదు..

ఇక నయీం తరహాలో ప్రభుత్వం దౌర్జన్యంగా భూములు   లాక్కుంటుందని చాలా తీవ్రంగా విమర్శించారు..అసలు నయీం అనే కిరాతకుడిని పెంచి పోషించిందే ఇప్పుడు మీరు రాసుకుని , పూసుకుని తిరుగుతున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు..నయీంను అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులను మీరు ఏనాడు ప్రశ్నించలేదు ఎందుకుని..టీఆర్ ఎస్ ప్రభుత్వం వలనే తెలంగాణకు శాపంగా మారిన  నయీం లాంటి దుర్మార్గుడు అంతం
అయ్యాడు..అంతే కాదు నయీంతో సంబంధాలు ఉంటే సొంత పార్టీ నాయకులను కూడా ఉపేక్షించమని సీఎం కేసీఆర్ ప్రకటించాడు..అయితే నయీంతో సంబంధమున్న మీ సామాజిక వర్గానికే చెందిన కాంగ్రెస్ ,టీడీపీ నాయకులతో కల్సి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం ఏం బాగాలేదు..నయా ననయీంలంతా మీ పక్కనే ఉన్న కాంగ్రెస్, టీడీపీ నాయకుల్లోనే ఉన్నారు సార్..కాస్త చూసుకోండి ..కోదండరామ్ సార్ ..తెలంగాణ కోసం పోరాడిన మీరు అంటే ఇప్పటికీ ప్రజలందరికీ
గౌరవం ఉంది..కానీ ఉద్యమాలు నడిపిన మీరు ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ముందుకు పోతున్న తెలంగాణ ప్రభుత్వం మీద ఇలా ప్రతిపక్షాలతో కల్సి కుట్ర రాజకీయాలు చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.. మాష్టారు..మీకో దండం..దయచేసి బంగారు తలంగాణ కోసం ప్రభుత్వంతో కల్సి రండి..లేకుంటే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి..కానీ ఇలా ప్రతిపక్షాల చేతిలో పావుగా మారి పని చేసే ప్రభుత్వంపై అర్థం పర్థం లేని విమర్శలు చేసి మీ
గౌరవాన్ని తగ్గించుకోకండి..మీరంటే ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు గౌరవమే..అందుకే మీరు ప్రభుత్వాన్ని ఎంత బద్నాం చేస్తున్నా చూస్తూ మౌనంగా ఉంటున్నారే కానీ..మిమ్మల్నిఏమి అనలేకపోతున్నారు..ఎందుకంటే మీరు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి తర్వాత మిమ్మల్నే అంతగా గౌరవించారు కాబట్టి..కోదండ రామ్ సార్..మీకిది తగునా..!
       
                                                                                                                            - ఎస్.పి. కస్తూరి.

సంబంధిత వార్తలు