కన్నతల్లి సహకారం... కన్న కూతురిపై తండ్రే రెండేళ్లుగా అత్యాచారం

 కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు! తల్లి సహాయంతో రెండేళ్లుగా కన్నకూతురిపై అత్యాచారానికి ఒడిగడుతున్నాడు! ఈ అమానవీయ సంఘటన కొవ్వాడ పంచాయతీలోని చిన కొవ్వాడలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. చినకొవ్వాడకు చెందిన మైలపల్లి అప్పన్న రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఇందుకు కన్నతల్లి మైలపల్లి పోలమ్మ కూడా సహకరిస్తోందని తెలిపింది.

ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో.. వారంతా కలిసి ఇంటికి వెళ్లి  అప్పన్న, పోలమ్మను నిలదీశారు. అందుకు వీరు అంగీకరించడంతో గ్రామస్తులు అప్పన్నకు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. తర్వాత అప్పన్న, పోలమ్మ పరారయ్యారు. జె.ఆర్‌.పురం ఎస్సై వి. సత్యనారాయణకు శనివారం బాలిక ఫిర్యాదుచేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై డీఎస్పీ కె.భార్గవరావునాయుడు ఆదేశాల మేరకు సిఐ వై.రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు