ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ పై బూట్ల దాడి చేసిన వ్యక్తీ ..

పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌కు ఈ రోజు ఒక చేదు అనుభవం ఎదురైంది.సాక్షాత్తు ఇయనపై ఒక వ్యక్తి బూటు విసిరాడు. ఆ రాష్ట్రంలో బటిండాలో ఈ రోజు (బుధవారం) నిర్వహించిన జనతా దర్భార్‌ సమావేశానికి బాదల్‌ హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన వారిలో ఒక  వ్యక్తి ఉన్నట్టుండి బాదల్‌పై బూటు విసిరాడు. అకాళీదల్‌ అధినేత అయిన బాదల్‌పై ఇలా బూటుతో దాడి చేయడం ఇది రెండోసారి. 2014లో ఖన్నాలో నిర్వహించిన ఒక  ఫంక్షన్‌కి బాదల్‌ హాజరుకాగా అక్కడ ఓ వ్యక్తి ఇలాగే ఆయనపై బూటు విసిరాడు. సీఎంపై బూటు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు