గౌతమీ పుత్ర శాతకర్ణి పై హైకోర్టులో పిటిషన్...

సంక్రాంతి పండుగకు బాలయ్య 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదలవ్వబోతోంది.ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపును ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ చిత్రానికి పన్ను మినహాయింపును నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలో హీరోగా చేసిన బాలకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబుకు బంధువు అవ్వడం వల్లే పన్ను మినహాయింపును ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాత నుంచి డబ్బు వసూలు చేయవచ్చని వ్యాఖ్యానించింది. అయితే కోర్టుకు సెలవులు కావడంతో పిటిషనర్ ను రెగ్యులర్ బెంచ్ కు వెళ్లాలని కోర్టు సూచించింది. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి ఏపీతో పాటూ తెలంగాణ ప్రభుత్వం కూడా వినోదపు పన్నును మినహాయింపును ఇచ్చింది.

సంబంధిత వార్తలు