హ్యాపీ బ‌ర్త్ డే...ద్రవిడ్.

టీమిండియాలో ఆపద్భాంధవుడి పాత్ర పోషించి నిలకడకు నిర్వచనంగా, ప్రొఫెషనలిజంకు పర్యాయపదంగా అతడు క్రికెట్ చరిత్రలో ప్రసిద్ధికెక్కాడు. జట్టు ఓటమి ముందు నిలబడిన ప్రతిసారి అడ్డుగోడలా నిలబడి నిబ్బరంగా ఆడేవాడు. తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుంటూ ‘మిస్టర్ డిపెండబుల్’ ప్లేయర్ గా ప్రఖ్యాతిగాంచాడు. అతడెవరో కాదు రాహుల్ ద్రవిడ్. ఈ రోజు ద్రవిడ్ 43 పుట్టినరోజు.

ఎంతో మంది అభిమానులు, ప్రముఖులు, క్రికెటర్లు అతడికి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ద్రవిడ్ ఆటను, అతడి వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు, ఫొటోలు పెట్టారు. తన ఆటతీరుతో ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ల సరసన స్థానం సంపాదించుకున్న ద్ర‌విడ్ రిటైర్మెంట్ తర్వాత కూడా కోచ్ గా క్రికెట్ కు సేవలు అందిస్తున్నాడు.భారత క్రికెట్ దిగ్గజాలు దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసిన చతుష్టయంలో ఒకడిగా నిలిచాడు. తన కెరీర్‌లో 164 టెస్టు మ్యాచ్‌లాడిన ద్రవిడ్ 13,288 పరుగులు చేశాడు. ప్రస్తుతం యువ క్రికెటర్లకు మెరుగులు దిద్దుతూ భారత క్రికెట్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నాడు.344 వన్డేలాడిన ద్రవిడ్ 10,899 పరుగులు సాధించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత భారత్ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడు రాహుల్ ద్రవిడ్. వన్డేలు, టెస్టులు రెండింట్లో రాహుల్ ద్రవిడ్ మొత్తంగా 24,208 పరుగులు చేశాడు.

సంబంధిత వార్తలు