భారత హాకీ జట్టు సారథి పీఆర్‌ శ్రీజేశ్‌ కు అరుదైన గౌరవం ..

భారత హాకీ జట్టు సారథి పీఆర్‌ శ్రీజేశ్‌ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) అథ్లెట్ల కమిటీకి ఎంపియ్యాడు.మొత్తం  ఎనిమిది మంది సభ్యులున్న ఈ బృందంలో నలుగురు ప్రస్తుత క్రీడాకారులు, నలుగురు మాజీలు ఉంటారు. ఎఫ్‌ఐహెచ్‌ నిర్ణయ ప్రక్రియలో ఆటగాళ్ల గొంతుక వినిపించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుంది. సమాఖ్యకు ఆటగాళ్లకు మధ్య అనుసంధాన కర్తగా ఉంటుంది.ఎఫ్‌ఐహెచ్‌ అథ్లెట్స్‌ కమిటీకి ఎంపికవ్వడం పట్ల శ్రీజేశ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. హాకీ దిగ్గజం మార్టిజ్‌ సహా అంతర్జాతీయ ఆటగాళ్లున్న బృందంలో భాగస్వామి కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు