బాలీవుడ్‌ హీరోయిన్ కు నచ్చిన భారత్ క్రికెటర్‌

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇప్పటికే ఎందరో బాలీవుడ్‌ తారలు కోహ్లీ తమ అభిమాన క్రికెటర్‌ అని వెల్లడించారు. మొన్నటికి మొన్న దిశా పటానీ తన అభిమాన క్రికెటర్‌ కోహ్లీ అని చెప్పింది. తాజాగా ఈ జాబితాలోకి మరో అందాల భామ కూడా వచ్చి చేరింది. గురువారం కరీనా కపూర్‌ 37వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా కోహ్లీ గురించి మాట్లాడుతూ.. కోహ్లీ ఆట తీరు ఎంతో ఇష్టమని.. తన ఫేవరేట్‌ క్రికెటర్‌ కూడా విరాట్‌ అని తెలిపింది. అంతేకాదు కోహ్లీ మరో సచిన్‌ అని, జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ ఆకట్టుకుంటున్నాడని పేర్కొంది. గతంలో కరీనా కపూర్‌ భర్త సైఫ్‌ అలీ ఖాన్‌ ఐపీఎల్‌లో ఓ జట్టును సొంతం చేసుకునేందుకు ప్రయత్నించాడు. సైఫ్‌ తండ్రి మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ భారత క్రికెట్‌ జట్టుకి నాయకత్వ బాధ్యతలు వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు